close
Choose your channels

మీడియా వర్సెస్ మాఫియా.. రవిప్రకాష్ షాకింగ్ న్యూస్!

Wednesday, June 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మీడియా వర్సెస్ మాఫియా.. రవిప్రకాష్ షాకింగ్ న్యూస్!

టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్‌ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ఎట్టకేలకు 27 రోజులపరారీ తర్వాత హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అటు సుప్రీంకోర్టు.. ఇటు హైకోర్టు రెండు వైపుల నుంచి ముందస్తు బెయిల్ వచ్చేందుకు మార్గాలన్నీ మూసుకుపోవడంతో చేసేదేమీ లేక రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మంగళవారం సుమారు ఆరుగంటలకు పైగా విచారించిన పోలీసులు బుధవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. బుధవారం ఉదయం సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవి హాజరయ్యారు. రెండో రోజు కూడా ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

మీడియా వర్సెస్ మాఫియా..!

విచారణ అనంతరం సైబర్ క్రైమ్ పీఎస్ ఎదుట మీడియాతో మాట్లాడిన రవిప్రకాష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ మీడియా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. మీడియా- మాఫియాకు మధ్య తెలుగు నేలపై యుద్ధం జరుగుతోందన్నారు.

మీడియా వైపు మేము ఉన్నామని.. మాతో పాటు ప్రజలంతా మీడియా వైపు ఉండాలని ఆయన కోరారు.

మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా రవిప్రకాష్ యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

అమ్రిష్‌పూరిలా వ్యవహరిస్తూ..!

"తెలంగాణలో మీడియా కబ్జా ఖండా కొనసాగుతుంది.

పేద రైతుల నుండి దొంగ పత్రాలు సృష్టించి, పొలుసులు, రెవెన్యూ అధికారులు ఒత్తిడితో ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో..? అదే పద్దతిలో మీడియాను కూడా ఆక్రమిస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ‘మోజో’ టీవీని పెట్టుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ చానెల్‌ను కూడా కబ్జా చేసే ప్రయత్నంలో కొందరు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అమ్రిష్‌పూరిలా వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసులు సహకారంతో ‘మోజో’ టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారు సత్యాన్ని చంపేయబోతున్నారు..

ఈ లేఖితాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి.

మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లు అందరూ పోరాటం చేయాలి.

ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుకుంటున్నాను" అని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

అయితే రవిప్రకాష్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు..? ఇంతకీ తెలంగాణలో ఉన్న ఆ అమ్రిష్‌పూరి ఎవరు..? నిజంగానే తెలంగాణలో భూముల్లాగా మీడియాను ఆక్రమించుకుంటున్నారా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే.. ఇంతకీ ఆ అమ్రిష్‌పూరీ ఎవరో తెలియాల్సి ఉంది. అయితే ఇన్ని అబండాలు మోపుతున్న రవిప్రకాష్ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది కూడా వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.