close
Choose your channels

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Monday, August 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ర‌వితేజ కూడా తొలిసారి త‌న కెరీర్ లో ఇలా భిన్న‌మైన కోణాలున్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీనువైట్ల త‌న గ‌త సినిమాల‌కు పూర్తిభిన్నంగా.. స‌రికొత్త జోన‌ర్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి కానుంది. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. విజ‌య్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు: ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.