అక్టోబర్ 29న రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్ విడుదల..

  • IndiaGlitz, [Thursday,October 25 2018]

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ '.. వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. కాగా టీజర్ ని అక్టోబర్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శెరవేగంగా జరుగుతున్నాయి.. గ్లామర్ డాల్ ఇలియానా కథానాయికగా నటిస్తుండగా, రవితేజ తో ఆమె నాలుగో సారి కలిసి నటిస్తుండండం విశేషం..పూర్తిభాగం అమెరికా లో షూటింగ్ జరుపుకోగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ అఫ్ 'అమర్ అక్బర్ ఆంటోనీ 'కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండగా రవితేజ డిఫరెంట్ గా కనిపించనున్నారు.. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More News

'శుభలేఖ+లు' హక్కుల్ని సొంతం చేసుకున్న బెల్లం రామకృష్ణా రెడ్డి

ఇటీవల కాలంలో  ఓ ప్రత్యేకమైన   అటెన్షన్  రప్పించుకున్న  చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా  విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను

'బంగారి బాలరాజు' సినిమా తప్పకుండా చూస్తాను - కె.వి.రమణాచారి

పరువు హత్యల నేపథ్యం లో వస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల సందర్భంగా తెలంగాణ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి

'ఏడు చేపల కథ' MeToo టీజ‌ర్ రెపు విడుద‌ల

"MeToo" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు " MeToo  "

'బైలంపుడి' పోస్టర్‌ లాంచ్‌!!

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'బైలంపుడి'.

రాజ‌మౌళి చిత్రంలో ట్విస్ట్ ఇదేనా?

బాహుబ‌లి ద‌ర్శ‌కుడు త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో రాజ‌మౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఈ అంచ‌నాల‌ను రెండింత‌లు చేసుకున్నారు.