రవితేజ, అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్ ' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,February 06 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. 'వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌' క్యాప్ష‌న్‌. ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా....

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది'' అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ''ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం'' అన్నారు.

More News

రవితేజ స్థానంలో గోపీచంద్....

మాస్ మహారాజా రవితేజ గతేడాది చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే టైటిల్ ఉన్న సినిమా చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి.

సారీ చెప్పి సర్దుకున్న నితిన్....

అఆ సక్సెస్ తర్వాత హీరో నితిన్ ఇప్పుడు హను రాఘవ పూడి సినిమా చేస్తున్నాడు.

'కబాలి' ఫైట్ మాస్టర్స్ డైరక్షన్ లో సందీప్ కిషన్ యాక్షన్

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా,కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'

శ్రీవల్లి కి సూపర్ రెస్పాన్స్

రజత్,మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా,రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై,

హాఫ్ మిలియన్ మార్కు సాధించిన నాని....

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో