'డిస్కోరాజా' సంద‌డి మొద‌లైంది. 

  • IndiaGlitz, [Monday,March 04 2019]

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ ని  త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని  అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు. శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని మార్చి 4న ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. 

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ ముందుగా మా ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్  బ్యాన‌ర్ త‌ర‌ఫున ప్రేక్ష‌కుల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు.  ర‌వితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. వినూత్న‌మైన క‌థ‌ల్ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకురావ‌డంలో మా బ్యాన‌ర్ ఎల్ల‌ప్పూడు ముందు ఉంటుంది. ఈ నేప‌థ్యంతోనే దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 

ఓ వినూత్న‌మైన ఆంశాన్ని ఈ సినిమా క‌థాంశంగా తీసుకున్నాం. మా బ్యానర్ వాల్యూ ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించబోతున్నాం. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నాము. ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొద‌లుపెట్టిన రోజు నుంచే ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటూ వ‌చ్చాం. అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా ఈ సినిమా రూపొందించేందుకు మా బృందం మొత్తం ప్లాన్ చేస్తుంది. 

అందుకే అటు మాస్ ఇటు క్లాస్ ని ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్ ని ఖారారు చేశాం. ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా సాయి శ్రీరామ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

అబ్బూరి ర‌వి ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు. మంగ‌ళ‌వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది.  ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ర‌వితేజ గారి స‌ర‌స‌న న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ న‌టుడు బాబీసింహా ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడుగా న‌టించ‌బోతున్నారు. క‌మీడియ‌న్స్ వెన్నెల‌కిషోర్, స‌త్య త‌దిత‌ర‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు అని తెలిపారు. 

More News

పాక్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన యుద్ధం మాటలు పాక్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ మాట్లాడుతూ.. "మీడియాలో నేను ఏదైనా మంచి మాట మాట్లాడితే చూపించ‌రు.

సీరియ‌ల్ నిర్మాత‌గా మారిన డైర‌క్ట‌ర్‌

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్‌లో సినిమాలు చేసిన టాప్ డైర‌క్ట‌ర్ ర‌మేష్ అర‌వింద్‌. క‌మ‌ల్‌హాస‌న్‌తో ప‌లు సినిమాలు చేసిన ర‌మేష్ అర‌వింద్ న‌టుడిగానూ సుప్ర‌సిద్ధుడు.

సిక్స్ ప్యాక్స్ చేస్తున్న విజ‌య్‌!

విజ‌య్ ఆంటోనీ ఇప్పుడు స్పీడ్ పెంచారు. రొటీన్ కేర‌క్ట‌ర్ల‌కు చెక్ పెట్టారు. గ‌త ఆరు నెల‌లుగా క‌ష్ట‌ప‌డి సిక్స్ ప్యాక్ చేశారు. తాజాగా డ్యాన్సు క్లాసుల‌కు వెళ్తున్నారు.

నాని 'జెర్సీ' వాయిదా ప‌డుతుందా?

కొన్ని సినిమాల మీద ప్రేక్ష‌కులే కాదు, హీరోలు కూడా అమాంతం ఆశ‌లు పెంచేసుకుంటుంటారు. నాని న‌టిస్తున్న 'జెర్సీ' సినిమా అలాంటిదే. ఇందులో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు నాని.

రామ్ చ‌ర‌ణ్ రేర్ ఫీట్‌

మెగాస్టార్ కుటుంబానికీ, బెంగుళూరుకు మంచి క‌నెక్ష‌న్ ఉంది. ఫ్యామిలీతో ఛిల్ అవుట్ కావాలంటే చిరంజీవి వెంట‌నే ఆలోచించే ప్లేస్ బెంగుళూరు. అక్క‌డి ఫామ్ హౌస్‌లో వారి కుటుంబం