కరోనా బారిన పడిన రవితేజ హీరోయిన్.. డబుల్ డోస్ తీసుకున్నా వదలని కోవిడ్

  • IndiaGlitz, [Monday,January 17 2022]

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,13,444 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 358 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 8,209 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు.

ఈ లిస్ట్‌లో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వున్నారు. ముఖ్యంగా సినీ కళాకారులు పెద్ద సంఖ్యలో పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, వడివేలు, త్రిష, అరుణ్ విజయ్, సత్యరాజ్, మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, కరీనా కపూర్, అమృతా అరోరా వంటి స్టార్స్ కరోనా బారినపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి యువ హీరోయిన్ డింపుల్ హయాతి చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నానని.. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని డింపుల్ చెప్పారు. అయినప్పటికీ వైరస్ సోకిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్ల సూచనలను, సలహాలను పాటిస్తున్నానని హయాతి పేర్కొన్నారు. అందరూ మాస్క్‌ ధరించి... శానిటైజ్‌ చేసుకోవాలని, తప్పనిసరిగా టీకా తీసుకోవాలని డింపుల్ విజ్ఞప్తి చేశారు. కాగా గతేడాది మేలో హయతి కుటుంబంలో ఏకంగా పదిమంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు డింపుల్ హయతి. ఇటీవల ‘అత్రంగి రే’ చిత్రంలోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నారు. దీంతోపాటు పలు తమిళ చిత్రాలకు సైతం హయాతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

More News

బంగార్రాజు మొద‌టిరోజు వ‌సూళ్ళు 17.5 కోట్లు గ్రాస్: నాగార్జున

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్

సికింద్రాబాద్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం, బ్రిటీష్ వారి హయాంలో నిర్మాణం

సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

అన్ని ఏరియాల్లో 'హీరో' కు సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది: నిర్మాత గల్లా పద్మావతి

అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు.

"నేను త్వరగా చనిపోవాలి, అందరికీ సంక్రాంతి విషెస్".. వర్మ వెరైటీ ట్వీట్

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు ప్రతిరోజూ ఎవరో ఒకరిని గిల్లకపోతే రామ్‌గోపాల్ వర్మకు నిద్రపట్టదు. కొందరు ఆయనకు పిచ్చి అంటారు.. ఇంకొందరు ఆయను జీనియస్ అంటారు.

రాజకీయాలకు దూరం.. పదవులకు ఆశపడే వాడిని కాదు: రాజ్యసభ ఆఫర్‌పై తేల్చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం కృష్ణా జిల్లా డోకిపర్రు వచ్చారు చిరంజీవి.