నానికి జోడీగా ర‌వితేజ హీరోయిన్‌?

  • IndiaGlitz, [Tuesday,February 27 2018]

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మిస్తున్న‌ విషయం తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా.. ఇటీవ‌లే మహతి స్టూడియోలో చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ సార‌థ్యంలో పాటల రికార్డింగ్‌ను ప్రారంభించారు. కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా న‌టించ‌నుండ‌గా.. నాని డాక్టర్‌గా న‌టించ‌నున్నారు.

భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. ప్ర‌స్తుతం వర్మ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న నాగార్జున.. ఆ చిత్రాన్ని పూర్తిచేశాకే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటార‌ని సమాచారం. ఇదిలా వుంటే.. ఈ మూవీలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంద‌ని తెలిసింది.

అలాగే అనుష్క పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. నానికి జోడీగా మాళవిక శర్మ పేరును పరిశీలిస్తునట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం మాళవిక.. రవితేజ హీరోగా న‌టిస్తున్న‌ నేల టికెట్' మూవీలో నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More News

చిత్రీకరణ తుదిదశ లో విజయ్ దేవరకొండ చిత్రం

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గీతా గోవిందం'(ప్రచారంలోనున్న పేరు).

మార్చి 5 నుంచి 'సైరా నరసింహారెడ్డి' షెడ్యూల్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.

నాగ్ , వర్మ చిత్రం టైటిల్ అదేనా?

కింగ్ నాగార్జున,సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే.

ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆలస్యం?

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్క నున్న చిత్రం 'యన్.టి.ఆర్'.

అందరికీ తెలిసిన శ్రీదేవి గురించి కొందరికే తెలిసిన కొన్ని విషయాలు

అడుగుపెట్టింది బాల నటిగానైనా హీరోయిన్ గా అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగి -ఆందంలోనూ, అభినయంలోనూ, అంతఃకరణ లోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి