మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ర‌వితేజ

  • IndiaGlitz, [Monday,October 05 2015]

'కిక్ 2' డిజాస్ట్ర‌స్ రిజ‌ల్ట్ పొంద‌డంతో క‌థానాయ‌కుడు ర‌వితేజ త‌న ఆశ‌ల‌న్నీ 'బెంగాల్ టైగ‌ర్' పై పెట్టుకున్నాడు. ఈ నెల 18న ఆడియోని, న‌వంబ‌ర్ 5న దీపావ‌ళి కానుక‌గా సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న ఈ సినిమాకి సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఈ సినిమా విష‌యంలో ర‌వితేజ మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఉన్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

కాస్తంత వివ‌రాల్లోకి వెళితే.. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి హిట్ చిత్రాల త‌రువాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ మూవీగానూ, 'బాహుబ‌లి' త‌రువాత త‌మ‌న్నా హీరోయిన్‌గా వ‌స్తున్న సినిమాగానూ 'బెంగాల్ టైగ‌ర్' పై పాజిటివ్ వైబ్స్ ఉంటే.. 'కిక్ 2' ఫ్లాప్‌ త‌రువాత త‌న నుంచి వ‌స్తున్న చిత్రంగానూ, అలాగే 'జోరు', 'జిల్' (పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా..లాభాలు కురిపించ‌లేక‌పోయింది), 'శివ‌మ్' వంటి ఫ్లాప్‌ చిత్రాల అనంత‌రం రాశీ ఖ‌న్నా నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ర‌వితేజ మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఉన్నాడ‌ట‌. మ‌రి 'బెంగాల్ టైగ‌ర్' రిజ‌ల్ట్ ఏ వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

More News

అయినా సుకుమార్ వ‌ద‌ల‌డం లేదు

సుకుమార్ సినిమాలు అంటే తెలివితేట‌లకు ప‌రీక్షలు పెట్టే సినిమాలన్న‌ది కొంద‌రి సినిమా ప్రేమికుల మాట‌. అత‌ని గ‌త చిత్రం '1 నేనొక్క‌డినే' అయితే ఇందుకు పూర్తిస్థాయి ఉదాహ‌ర‌ణ‌.

బాహుబ‌లి 1..2..3

తెలుగు సినిమా స్టామినాని ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి ఎవ‌రు ఊహించ‌ని స‌రికొత్త రికార్డు స్రుష్టించింది బాహుబ‌లి.

బ్రూస్ లీ టైటిల్ బ్రూస్ లీ 2 గా మారిందా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెర‌కెక్కించారు. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై దాన‌య్య ఈ సినిమాని నిర్మించారు.

షామిలిపై పాజిటివ్ రిపోర్ట్స్‌

బాల‌నటిగా స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న న‌టి షామిలి. అప్ప‌ట్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణం ఉండేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి క్రేజ్ ని మూట‌గ‌ట్టుకున్న షామిలిని హీరోయిన్‌గా చూడాల‌ని చాలా మంది ఆశ‌ప‌డ్డారు. దానికి త‌గ్గ‌ట్టే 'ఓయ్‌'తో నాయిక‌గా తొలి అడుగులు వేసింది షామిలి.

'ది ఐస్' మూవీ రివ్యూ

అవయవాల మార్పిడిపైన మనకు వచ్చిన సినిమాలు తక్కువే. వచ్చిన వాటిలోనూ కళ్ళ మీద వచ్చిన సినిమాలే ఎక్కువ. తాజాగా మీరాజాస్మిన్ నటించిన ‘ది ఐస్’ కూడా అలాంటి సినిమానే.