'ఖిలాడి' ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

  • IndiaGlitz, [Saturday,September 11 2021]

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖిలాడి' షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవ‌ల ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మీద తెర‌కెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.
ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.

ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అద‌ర‌గొట్టారు. తెరపై ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

ఇక ఈ పాట‌కు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చారు. శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.

థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కష్టపడుతున్నారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయ‌నున్నారు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, అనసూయ

More News

బ్రేకింగ్ : హీరో సాయి ధరమ్ తేజ్‌కు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదం, అపస్మారక స్థితిలో మెగాహీరో

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

విశాల్ `సామాన్యుడు` సెకండ్ లుక్...డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ మూవీగా రూపొందుతోన్న చిత్రం `సామాన్యుడు`. “నాట్ ఎ కామన్ మ్యాన్”

'లవ్ స్టోరి' సెప్టెంబర్ 24న విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి".

'బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్' ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్".

తెలుగు, హిందీ  భాషల్లో థియేటర్స్ లలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న 'స్ట్రీట్ లైట్'

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా