Ravi Teja: రవితేజ చేతుల మీదుగా 'చోర్ బజార్' నుంచి 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,June 15 2022]

ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’ సినిమాను సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ స్టార్ రవితేజ. ఈ చిత్రంలోని 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే. తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్ పేరు మీద చేసిన పాట కాబట్టి రవితేజ సంతోషంగా ఈ పాటను విడుదల చేశారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' బాగుందని, ‘‘చోర్ బజార్’’ సినిమా హిట్ అవ్వాలని ఆయన విశెస్ తెలిపారు.

'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' పాటను మదీన్ ఎస్కే స్వరకల్పనలో మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే..షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలోగానే వెళ్లిపోయా ఎక్స్ రోడ్డుకి. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చే సీను. ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాను. నన్నే చూస్తు ప్లే చేస్తుంటే ఫ్లాట్ అయ్యాను...అంటూ సాగుతుందీ పాట.

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ నాయికగా నటించింది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చోర్ బజార్ ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పకులుగా వ్యవహరించడం చిత్రానికి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

More News

Sumanth: ఆకట్టుకుంటున్న సుమంత్ "అహం రీబూట్" ఫస్ట్ గ్లింప్స్

సుమంత్ హీరోగా  న‌టిస్తున్న కొత్త సినిమా "అహాం రీబూట్". ఈ  చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో

ys sharmila: షర్మిల నియోజకవర్గం ఫిక్స్.. ‘‘పాలేరు’’ నుంచి బరిలోకి.. అక్కడే ఎందుకంటే..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు వైఎస్ షర్మిల.

LPG Connection : సామాన్యుడిపై మరో భారం.. గ్యాస్ కనెక్షన్ డిపాజిట్ భారీగా పెంపు, ఎంతంటే..?

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు.

Jubilee Hills Rape Case : ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే అత్యాచారం... నిందితుల మాటలకు షాకైన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా అత్యాచారం కేసులో ఊహకందని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

AP Govt: రెస్టారెంట్లు, హోటళ్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్... జనాలు ఖుషీ

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.