రవితేజ కొత్త సినిమా టైటిల్ 'టచ్ చేసి చూడు'

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ...."మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం." అని తెలిపారు.

దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ - "ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్.మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, కో డైరెక్టర్ : రాంబాబు, ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్.యాక్షన్ : పీటర్ హేన్స్, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

More News

వెన‌క్కి లాగే వ్యాఖ్య‌లు చేయ‌కండి - ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త‌కు పిలుపు నివ్వ‌టంతో ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు రెడీ అవుతున్నారు.

చిరు 151వ చిత్రం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 రికార్డ్ స్ధాయిలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం

గుంటూరోడు ఆడియోకు గెస్ట్ లు వీళ్లే..!

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ & బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ జంట‌గా  S.K. సత్య తెర‌కెక్కిస్తున్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గుంటూరోడు. ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై వ‌రుణ్ అట్లూరి నిర్మిస్తున్నారు.

ఆంధ్రులు మీ బానిసలు అని పొరబడద్దు - పవన్ కళ్యాణ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువతకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

మహేష్ , కొరటాలకు కోర్టు సమన్లు.....

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.