రవితేజ మరో సినిమా మొదలు కానుంది...

  • IndiaGlitz, [Sunday,February 05 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ...ఇడియ‌ట్ నుండి బెంగాల్ టైగ‌ర్ వ‌ర‌కు త‌న‌కే సొంత‌మైన‌ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ఆడియెన్స్‌లో త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం 'రాజా ది గ్రేట్'. 'వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌' క్యాప్ష‌న్‌.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ అంటేనే నాటి దిల్ నుండి నేటి శ‌త‌మానం భ‌వ‌తి వ‌ర‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న నిర్మాణ సంస్థగా ప్రేక్ష‌కుల్లో మంచి పేరుంది. ఇటువంటి స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా 'రాజా ది గ్రేట్' సినిమా రూపొందుతుంది. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రిన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా రేపు లాంచ‌నంగా ప్రారంభం కానుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి నుండి ఉంటుంది. ఈ సినిమాలో ర‌వితేజ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

More News

ఇప్పుడు సమంత వంతు

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

శర్వానంద్ చేతులమీదుగా 'ఓ పిల్లా నీ వల్లా' టీజర్ లాంచ్

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.

హలీవుడ్ టెక్నిషియన్ తో ఎన్టీఆర్

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు`.

ఐదు క్లైమాక్స్ ప్రిపేర్ చేసుకున్న దర్శకుడు

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. 1971లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.