ర‌వితేజ స్కెచ్‌.. సిద్ధార్థ హెల్పూ..

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

ర‌వితేజ వేసే స్కెచ్‌కు సిద్ధార్థ హెల్ప్ చేస్తాన‌ని మాటిచ్చారు. అయితే అది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. మ‌న హీరోల సినిమాల్లో అడ‌పాద‌డ‌పా కేర‌క్టర్లు చేస్తూనే ఉన్నారు సిద్ధార్థ‌. ఎన్టీఆర్‌తో ఆ మ‌ధ్య చేసిన ఆయ‌న తాజాగా ర‌వితేజ‌తో క‌లిసి చేయ‌నున్నారు. ఈ సినిమాకు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'ఆర్‌.ఎక్స్.100' త‌ర్వాత అజ‌య్ భూప‌తి టేక‌ప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇందులో హీరోలు ఇద్ద‌రూ స్మ‌గ‌ర్లుగా క‌నిపించ‌నున్నార‌ట‌.

ర‌వితేజ‌తో అదితిరావు తొలిసారి జోడీ క‌ట్ట‌నుంది. సిద్ధార్థ స‌ర‌స‌న ఎవ‌రుంటార‌నే సంగ‌తి ఇంకా తెలియ‌డం లేదు. అక్టోబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రోవైపు ర‌వితేజ ఇప్పుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సిద్ధార్థ చేతిలో త‌మిళంలో బాగానే సినిమాలు ఉన్నాయి. ఎమోష‌న‌ల్ స్క్రిప్ట్ లో ర‌వితేజ తాలూకు మాస్ అంశాలు, సిద్ధార్థ‌కు స‌రిపోయే క్లాస్ అంశాలు, అజ‌య్ తాలూకు క‌ల్ట్ ఉంటాయ‌ని టాక్‌. ఈచిత్రానికి మ‌హాస‌ముద్రం అని వ‌ర్కింగ్ టైటిల్‌గా అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.

More News

మ‌హేష్ థంబ్స‌ప్

ఇంత‌కు ముందు చిత్రాల‌తో పోలిస్తే ఇప్పుడు మ‌హేష్ త‌న అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్2లో ర‌కుల్‌

నా జీవితంలో అంద‌రిలా నాకూ ఏడాదికి 365 రోజులే. అన్ని రోజులూ నాన్‌స్టాప్‌గా ప‌నిచేస్తూనే ఉన్నాను.

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా...

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా.. అత‌నికి ఆ విష‌యం ముందే ఉప్పందిందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు సినీ జ‌నాలు.

బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్...!

తెలుగులో రెండు సీజన్లు విజయవంతం చేసుకున్న బిగ్‌బాస్ షో.. త్వరలో మూడో సీజన్‌ను ప్రారంభించబోతోంది.

అల్లు అర్జున్ - కో డైర‌క్ట‌ర్ స‌త్యం ఇష్యూ...

అస‌లేం జ‌రిగిందంటే..? అల్లు అర్జున్ సెట్లో యాటిట్యూడ్ చూపించారా?  దీనివ‌ల్ల కో డైర‌క్ట‌ర్ హ‌ర్ట్ అయ్యారా?