ఆ నిర్మాత‌ తో ర‌వితేజ మూడు చిత్రాల డీల్‌?

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని.. 'రాజా ది గ్రేట్'తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'లో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే నెలలో విడుదలకు ముస్తాబ‌వుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ నిర్మాతతో మూడు చిత్రాలు చేయడానికి రవితేజ అగ్రిమెంట్ చేసారని తెలిసింది. అందులో భాగంగా తొలి చిత్రంగా 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన రెండు సినిమాలను కూడా చేయడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. ఆ రెండు సినిమాలు కూడా బాబీ, బి.వి.ఎస్.రవి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికే.. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీలో నటిస్తున్న ర‌వితేజ‌.. ఇది పూర్తైన వెంట‌నే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో న‌టించ‌బోతున్నారు. మరి రామ్ తాళ్లూరితో చేయదలచుకున్న ఆ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి.

More News

ప్ర‌భాస్ బాట‌లోనే సాయిధ‌ర‌మ్ కూడా వెళ‌తాడా?

సాయి ధరమ్ తేజ్ హీరోగా, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రికార్డు స్థాయిలో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల‌ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'.

రామ్ జోడిగా ప్ర‌ణీత‌..

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో

'బాహ‌బ‌లి 2' మ‌రో రికార్డ్‌

`బాహుబ‌లి 2` విడుద‌లై ఏడాది దాటి పోతున్న ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిల‌స్తుంది.

దేవిశ్రీ ప్ర‌సాద్ 14.. స‌మంత 13..

తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.