రవితేజకి మరోసారి తప్పని పోటీ

  • IndiaGlitz, [Saturday,February 24 2018]

గత కొద్ది కాలంగా విజయాలకు దూరమైన మాస్ మ‌హారాజా రవితేజ.. రాజా ది గ్రేట్'తో మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. అయితే ఇటీవల విడుదలైన టచ్ చేసి చూడు' చిత్రం పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. రవితేజలాగే విజయాలకు దూరమైన యంగ్ హీరో నాగశౌర్య.. రవితేజ నటించిన టచ్ చేసి చూడు' చిత్రంతో పాటే ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేగాకుండా, ఈ చిత్రంతో త‌న‌ కెరీర్లోనే పెద్ద‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు నాగ‌శౌర్య‌. క‌ట్ చేస్తే..

ఈ వేసవికి త‌న త‌దుప‌రి చిత్రం నేలటికెట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ర‌వితేజ‌. వరుస హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 25న విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. ఈ సారి కూడా ర‌వితేజ సినిమాతో పాటు మ‌రో యువ క‌థానాయ‌కుడి సినిమా విడుద‌ల కాబోతోంది. అదే.. నాగ చైతన్య సవ్యసాచి'. చందు మొండేటి రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మే 24న విడుద‌ల కానుంది. మ‌రి ఈ సారి కూడా యువ క‌థానాయ‌కుడే స‌క్సెస్ అవుతాడో లేదంటే ర‌వితేజ‌కి స‌క్సెస్ వ‌రిస్తుందో చూడాలి.

More News

గోపీచంద్ వర్సెస్ విజయ్ దేవరకొండ

మూడున్నరేళ్ళ క్రితం వచ్చిన 'లౌక్యం' చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యాక్షన్ హీరో గోపీచంద్.

మార్చి 9న 'ఏ మంత్రం వేశావే'

పెళ్లిచూపులు,అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.

'ఛల్ మోహన్ రంగ' తొలి గీతం విడుదల

'గ ఘ మేఘ ..నింగే మనకు నేడు పాగ' అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో

పాత వాటిని వాడేసుకుంటున్న నితిన్

‘జయం’(2002)సినిమాతో కథానాయకుడిగా పరిచయమై..తొలిచిత్రంతోనే తన ఖాతాలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో నితిన్.

బన్నీ ఖాతాలో మరొకటి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెబితే గుర్తుకొచ్చే చిత్రం 'ఆర్య'.