close
Choose your channels

ఎన్నారైగా రవితేజ

Wednesday, January 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజా ది గ్రేట్‌లో అంధుడి పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ట‌చ్ చేసి చూడు చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుద‌లకి ముందే.. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాని మొద‌లుపెట్టేశారు ర‌వితేజ‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మాళ‌వికా శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న‌తో వెంకీ, దుబాయ్ శీను వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ మ‌రో సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఇంత‌కీ అదేమిటంటే.. ఇందులో ర‌వితేజ ఎన్నారై పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.