close
Choose your channels

'రామారావు' గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

Monday, July 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామారావు గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

మాస్ మహారాజ్ రవితేజ 68వ చిత్రం శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర నేపథ్యం పరిచయం చేసే విధంగా చిత్ర యూనిట్ ప్రీ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది.

రవితేజ ఈ మూవీలో ప్రభుత్వ అధికారిగా నటించబోతున్నాడనే విషయంలో హింట్స్ ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'రామారావు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంటే ఈ మూవీలో రవితేజ పాత్ర పేరు రామారావు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

గాగుల్స్, ఫార్మల్ డ్రెస్ ధరించిన రవితేజ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. బ్యాగ్రౌండ్ ఆసక్తికరంగా ఉంది. రవితేజ ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన లెటర్ కూడా ఉంది. బ్యాగ్రౌండ్ లో ప్రభుత్వం రవితేజకు కల్పించిన వాహనం కూడా ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ స్ట్రైకింగ్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది.

రామారావు గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

విధి నిర్వహణ కోసం ఎంతకైనా తెగించే ప్రభుత్వ అధికారిగా రవితేజ పాత్ర ఉండబోతున్నట్లు టాక్. అయితే రవితేజ అధికారిగా ఏ శాఖలో భాద్యతలు నిర్వహిస్తున్నాడు, అతడి జాబ్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథని రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇదిలా ఉండగా రవితేజ చివరగా నటించిన క్రాక్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ కాప్ గా నటించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.