close
Choose your channels

నిర్మాతగా రవితేజ.. నిజమెంతో..?

Wednesday, February 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిర్మాతగా రవితేజ.. నిజమెంతో..?

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌. నేటిత‌రం యువ హీరోలు చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌వితేజ త‌ర్వాత న‌టుడిగా మారడం, ఆ త‌ర్వాత త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో స్టార్‌గా ఎదిగాడు ర‌వితేజ‌. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన క్రాక్ సినిమాతోనూ కెరీర్ బ‌స్ట్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్నాడు ఈ మాస్ మ‌హారాజ‌. ఇప్పుడు ర‌వితేజ కొత్త ట‌ర్న్ తీసుకోబోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు ర‌వితేజ నిర్మాత‌గా మారుతున్నాడ‌ట‌.

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ లో బ‌డ్జెట్‌, మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేయ‌డానికి ర‌వితేజ నిర్ణ‌యించుకుని ఓ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేశాడ‌ట‌. ఆర్‌టీ వ‌ర్క్స్ పేరును కూడా ర‌వితేజ రిజిష్ట‌ర్ చేయించాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై ర‌వితేజ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. సినిమాల విషయానికి వ‌స్తే ప్ర‌స్తుతం ర‌వితేజ.. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.