మాస్ రాజాకి సెకండాఫ్ న‌చ్చ‌లేదు..

  • IndiaGlitz, [Thursday,December 17 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో త‌దుప‌రి సినిమాల పై చాలా కేర్ తీసుకుంటున్నాడు ర‌వితేజ‌. ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఎవ‌డో ఒక‌డు సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా సెకండాఫ్ ర‌వితేజ‌కి న‌చ్చ‌లేద‌ట‌. అందుక‌నే సెకండాఫ్ మార్చ‌మ‌ని ర‌వితేజ డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ కి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అందువ‌ల‌నే ఎవ‌డో ఒక‌డు ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ళ‌లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ర‌వితేజ ఫారిన్ లో ఉన్నారు. ర‌వితేజ ఫారిన్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత సెకండాఫ్ స్ర్కిప్ట్ సంత్రుప్తిక‌రంగా అనిపిస్తే.. ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌చ్చు అని టాక్.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నారా రోహిత్‌ 'తుంటరి'

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'.

లోఫర్ మూవీ రివ్యూ

హీరోను మాస్ యాంగిల్ లో డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో చూపించే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. మొదటి సినిమా ఇడియట్ నుండి లోఫర్ వరకు హీరో కొద్దిగా తేడాగానే కనపడతాడు. ఇక హీరో విషయానికి వస్తే వరుణ్ తేజ్ నటించిన మూడో సినిమా లోఫర్.

సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ ల '2.0'(రోబో సీక్వెల్) ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో'ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

యు.వి. బ్యానర్ లో మూవీ చేస్తున్న యంగ్ హీరో..

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ అంటే ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటిది.ఈ బ్యానర్ లో సినిమా చేస్తే చాలు...

లోఫర్ ని చూస్తున్న చిరు ఫ్యామిలీ...

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్.సి.కళ్యాణ్ నిర్మించిన లోఫర్ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.