close
Choose your channels

సరికొత్త లుక్‌తో షాకిచ్చిన రవితేజ

Saturday, August 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరికొత్త లుక్‌తో షాకిచ్చిన రవితేజ

తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. స్టార్ హీరోలు కథలు, పాత్రల ప్రకారం కొత్తగా కనపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రంగస్థలంలో రామ్‌చరణ్, జైలవకుశలో ఎన్టీఆర్.. ఇలా అందరూ కథానుగుణంగా కొత్త పాత్రలతో మెప్పించారు. ఇప్పుడు వారి బాటలోనే మాస్ మహారాజా రవితేజ అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈయన నటిస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘ఒక్కక్షణం’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం(తండ్రీ కొడుకులు) చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌లో విడుదలయ్యే తెరకెక్కుతోన్న ఈ రివేంజ్ డ్రామా నుండి లీకైన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఐదుపదలు వయసు దాటిన రవితేజ కొత్త లుక్ చూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. లుక్‌లో రవితేజను గుర్తుపట్టడానికి కాస్త సమయం పడుతుంది. 50 ఏళ్ల రవితేజ 30ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. టైమ్ మెషిన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి. పాయల్ రాజ్‌పుత్, నభానటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రవితేజ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే rx100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తాడని.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ ఈసారి మాత్రం ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారట. అందుకోసమే లుక్ విషయంలో కూడా పూర్తిగా మారిపోయారు. డిస్కోరాజా ఓ కొరియన్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.