close
Choose your channels

హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తున్న మాస్ రాజా!

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తున్న మాస్ రాజా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ సినిమాలు చేసేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ సినిమాలో న‌టిస్తున్నాడు. దీని త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా.. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయాల్సి ఉంది. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌ను ప‌ట్టించుకోకుండా సినిమాలు చేయ‌డం ర‌వితేజ అల‌వాటు. అలాగే ద‌ర్శ‌కులైన‌, హీరోలైన క‌థ న‌చ్చితే చాలు వారితో క‌లిసి ముందుకెళ్లిపోతుంటాడు.

అదే కోవలో ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ర‌వితేజ హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తున్నాడు. క్రాక్ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బ‌లుపు త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది.. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత వీరు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మవుతుంది. అలాగే ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే కిలాడీ చిత్రంలో మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ట‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు నేల టిక్కెట్టు సినిమా వ‌చ్చింది. ఇలా హీరోయిన్స్ విష‌యంలో ర‌వితేజ.. వ‌రుస సినిమాల్లో న‌టించిన వారితో మ‌ళ్లీ న‌టిస్తున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz