ఎన్టీఆర్ సినిమాలో రాయ‌ల‌సీమ‌ సీన్స్ కాసేపే..

  • IndiaGlitz, [Thursday,July 05 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందనీ.. సెకండ్ హాఫ్ మొత్తం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందనీ.. దీనికోసం త్రివిక్రమ్ ప్రత్యేకించి ఎన్టీఆర్ కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ కూడా రాయిస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అత్యధిక భాగం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో మాత్రం రాయలసీమ సీన్స్‌ని టచ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా.. ఆ సీన్స్ అన్ని చెప్పుకోదగ్గ నిడివిలోనే ఉంటాయనీ.. అంతేగాని సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఉండదని అంటున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

'తేజ్ ఐ లవ్ యు'.. ప్రత్యేకత అదే

తొలి చిత్రం 'తొలిప్రేమ'తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ల సరసన చేరిపోయారు

అమాయక చక్రవర్తిగా మారనున్న యాక్షన్ హీరో!

'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయక', 'సాక్ష్యం'.. ఇలా వరుసగా యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్.

జులై 13న 'చినబాబు' విడుదల

కార్తీ, సయేష జంటగా నటించిన 'చినబాబు' సినిమాను జులై 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు.

సోనాలి షాక్‌

బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.

రూ.180 కోట్ల బ‌డ్జెట్‌తో రానా చిత్రం?

చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ 'హిర‌ణ్య‌క‌శ్య‌ప' పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.