సృజనాత్మక విద్య మా లక్ష్యం - నారా లోకేష్


Send us your feedback to audioarticles@vaarta.com


జాతీయ విద్యా విధానం లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యానైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ఎపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇందులో భాగంగా తొలుత ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణ, జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా, సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు.
ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఇప్పటివరకు అమలుచేస్తున్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కెజి టు పిజి విద్య కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నామని చెప్పారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రేమాండ్స్ ఇండిపెండెంట్ డైరక్టర్ కె.నరసింహమూర్తి, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జతిన్ ఖన్నా, సింఘానియా ట్రస్ట్ ప్రిన్సిపాల్ రేవతి శ్రీనివాసన్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ రోహిత్ ఖన్నా, చీఫ్ గార్మెంటింగ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ భారతి, రేమాండ్స్ ఇంజనీరింగ్ బిజినెస్ సిఇఓ గౌతమ్ మైనీ, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నవీన్ శర్మ, చైర్మన్ సెక్రటరీ అతుల్ ఖేల్కర్ పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments