ఏపీలో లక్షన్నరకు చేరవవుతున్న కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Friday,July 31 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. రోజుకు పదివేలు కేసులు నమోదవుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే రేపటికి ఏపీలో కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంటుంది. కాగా.. శుక్రవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిళ్లను పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 10,376 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరుకుంది. కాగా ఇప్పటి వరకూ 63,864 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 75,720 యాక్టివ్ కేసులున్నాయి.

అయితే నేడు అత్యధికంగా అనంతపురం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అనంతలో 1387 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1215 కేసులు, కర్నూలు జిల్లాలో 1124 కేసలు నమోదయ్యాయి. కాగా నేడు కరోనాతో గుంటూరు జిల్లాలో 13 మంది, అనంతలో తొమ్మిది మంది, కర్నూలులో ఎనిమిది మంది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1349 మంది మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

బాల‌య్య 107కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మీదున్నారు. ఎందుకంటే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.

గవర్నర్ ఆమోదం.. 3 రాజధానులకు లైన్ క్లియర్

ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన 'జెర్సీ'

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు  'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా

తనను ట్రోల్ చేసిన నెటిజన్‌కి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

ఎవరైనా కరోనా బారిన పడ్డారంటే.. ఎవరమైనా త్వరగా కోలుకోవాలనే ఆశిస్తాం. అసలు మనకు ఏదైనా హాని చేసిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బంది

సాయితేజ్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు