close
Choose your channels

సెట్స్‌లోనే నిద్ర పోవ‌డానికి రెడీ: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Wednesday, February 24, 2021 • తెలుగు Comments

సెట్స్‌లోనే నిద్ర పోవ‌డానికి రెడీ:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’. పూరీ క‌నెక్ట్స్‌, ధర్మ ప్రొడక్ష‌న్స్ ప‌తాకాల‌పై సినిమాను పూరీ జ‌గన్నాథ్‌, ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కొంత మేర‌కు ముంబైలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా యూనిట్ కోవిడ్ కార‌ణంగా షూటింగ్‌ను ఆపేసింది. ఎట్ట‌కేల‌కు ముంబైలో ‘లైగర్’ సినిమా రీస్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాను సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందిస్తూ ‘‘లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయ్యాను. అందుక‌నే ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ జ‌రిపిన పాల్గొన‌డానికి నేను సిద్ధం అని పూరీగారికి చెప్పాను. రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా షూటింగ్‌లో పాల్గొంటాను. అవ‌స‌రం అయితే హోట‌ల్‌కి వెళ్ల‌కుండా లైగ‌ర్ సెట్స్‌లోనే నిద్ర‌పోతానని కూడా చెప్పాను’’ అన్నాడీ రౌడీ హీరో.

లైగ‌ర్‌లో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్‌గా న‌టిస్తున్నాడు. పాత్ర కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నాడు. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు న‌ల‌బై శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Get Breaking News Alerts From IndiaGlitz