మహేష్ ఆలస్యానికి అసలు కారణమిదే..

  • IndiaGlitz, [Friday,April 28 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. నిజానికి సినిమాను జూన్ 23న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ ఉన్నట్లుండి సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. వాయిదా వేయ‌డానికి ప‌లు కార‌ణాలు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో విన‌ప‌డ్డాయి. కానీ అస‌లు విష‌యం ఏంటంటే స్పైడ‌ర్ క్లైమాక్స్‌, రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైన 'క‌వ‌న్‌' అనే త‌మిళ సినిమా క్లైమాక్స్ ఒకేలా ఉండ‌టమే అందుకు కార‌ణ‌మ‌ని, ఈ విష‌యం తెలిసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు క్లైమాక్స్‌ను రీ రైట్ చేశార‌ట‌. రీ రైట్ చేసిన క్లైమాక్స్‌ను మే 2 నుండి మే నెలాఖ‌రు వ‌ర‌కు షూట్ చేస్తార‌ట‌. సినిమాను జూలై లేదా ఆగ‌స్టులో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

బాహుబలిని ఆకాశానికెత్తేసిన ఎన్టీఆర్...

విజువల్ వండర్ గా రూపొందిన 'బాహుబలి 2' సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మెగాభిమానులు, ప్రభాస్ అభిమానుల మధ్య ఘర్షణ

బాహుబలి2 విడుదల సందర్భంగా అమలాపురంలో మెగాభిమానులు,ప్రభాస్ అభిమానులు మధ్య ఘర్షణ జరిగింది.

'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...

ప్రభాస్,అనుష్క,రానా,తమన్నాతారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో

'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.

వినోద్ ఖన్నాకన్నుమూత...

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.