వాస్తవ ఘటన ఆధారంగా 'రాజా మీరు కేక'

  • IndiaGlitz, [Thursday,June 15 2017]

గుంటూరు టాకీస్ చిత్రాన్ని నిర్మించిన ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రేవంత్‌, నోయల్‌, హేమంత్‌, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 16న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కృష్ణ కిషోర్ పాత్రికేయుల‌తో మాట్లాడారు..

సినిమా వైవిద్యంగా ఉంటుంది. ప్ర‌తి పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటుంది.ఇప్పుడు సోసైటీలో జ‌రుగుతున్న ఓ బ‌ర్నింగ్ ఇష్యూని బేస్ చేసుకుని తీశాం. నెల్లూరులో జ‌రిగిన ఓ వాస్త‌వ ఘ‌ట‌న‌ను క‌థ‌గా మ‌లిచి సినిమాగా తీశాను. విలువ‌ల‌తో పెరిగిన కుర్రాళ్లు ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొని ఎలా 'రాజా మీరు కేక‌' అని అనిపించుకుంటార‌న్నది ఆస‌క్తిక‌రం. సాప్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడు మూత‌ప‌డుతున్నాయో అర్థం కాని ప‌రిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. అలాంటి నేప‌థ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తున్నాను.

ఏ ఒక్క కంపెనీనో ఉద్దేశించి తీసిన సినిమా కాదు. స్నేహం, కుటుంబం, కామెడీ, థ్రిల్, అన్నీ ఇందులో ఉంటాయి. తార‌క‌ర‌త్న సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత‌గా న‌టించారు. పృథ్వి, పోసాని, గుండు సుద‌ర్శ‌న్ చేసిన స‌న్నివేశాలు గొప్ప‌గా ఉంటాయి. లాస్య పాత్ర ఏడిపిస్తుంది, న‌వ్విస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా న‌టించింది. శోభిత అనే పాత్రధారి కూడా చాలా బాగా న‌టించింది. నా సినిమాను చూసి సురేశ్‌బాబుగారు, సాయి కొర్ర‌పాటిగారు, కె.కె.రాధామోహ‌న్‌గారు మంచి క‌థ ఉంటే చెప్ప‌మ‌న్నారు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణ కిషోర్‌.

More News

అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్ - 2017

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ

'శమంతకమణి' టీజర్ విడుదల

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, డా. రాజేంద్రప్రసాద్, ఇంద్రజ కీలకపాత్రల్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `శమంతకమణి`. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

'విఠలాచార్య' షురూ..

విఠలాచార్య చాలా గొప్పదర్శకులు.ఆయన పేరుతో సినిమా స్టార్ట్ చేయడం బావుంది.

కోలీవుడ్ లో రాజశేఖర్ కుమార్తె...

రాజశేఖర్ దంపతుల మొదటి కుమార్తె శివాని త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వస్తున్నాయి. శివాని ప్రస్తుతం ఎం.బి.బి.ఎస్ మూడో ఏడాది చదువుతుంది. త్వరలోనే తెరంగేట్రం చేయనున్న శివాని తెలుగులో తేజ దర్శకత్వంలో నటిస్తుందని అన్నారు.

ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న బాలయ్య..

స్టార్ హీరోల సాంగ్స్ ను వారి వారసులు రీమిక్స్ చేయడం సర్వసాధారణ విషయమైంది.