జబ‌ర్‌ద‌స్త్ నుండి నాగబాబు వైదొలగడానికి కారణం ఇదే?

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

టీవీ కామెడీ షోస్‌లో ఈటీవీ జ‌బ‌ద‌స్త్ ప్రోగ్రామ్ స‌క్సెస్ అయినంత మ‌రే ప్రోగ్రామ్ కూడా స‌క్సెస్ కాలేదు. ఈ షో కోసం ప్ర్య‌తేకంగా అభిమానులు వారి స‌మయాన్ని కేటాయిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షోను ఏ షో బీట్ చేయ‌లేక‌పోయింది. దీన్ని క్రాస్ చేయాల‌ని చాలా టీవీ ఛానెల్స్ చాలా ర‌కాలైన కామెడీ షోస్‌ను ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ అది వ‌ర్కవుట్ కాలేదు. అంతెందుకు ఈటీవీ కూడా ఇలాంటి కామెడీ షోస్‌ను స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ అవేవీ స‌క్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ షోకి స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అదేంటంటే ఈ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ‌బాబు ఈ షో నుండి వెళ్లిపోతున్నాడు. స‌రే! నాగ‌బాబు వెళ్లిపోతే ఏంటి? అందుకు షో ఎందుకు ప్లాప్ అవుతుంద‌నుకోవ‌చ్చు. కానీ.. నాగ‌బాబు జ‌బ‌ర‌ద‌స్త్ షోలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న హైప‌ర్ ఆది, చ‌మ్మ‌క్ చంద్ర‌, సుడిగాలి సుధీర్ వంటి వారిని త‌న‌తో పాటు తీసుకెళ్లిపోతున్నాడ‌ట‌.

వీరికి కామెడీ షోల‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానులుంటార‌న‌డంలో సందేహ‌మే లేదు. వీరు వెళ్లిపోతే జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌న‌డంలో కూడా సందేహ‌మే లేదు. స‌ద‌రు షో రేటింగ్స్ ప‌డిపోతుంది. ఈ షో డైరెక్ట‌ర్స్ ఈటీవీకి పోటీగా ఉన్న మ‌రో ప్ర‌ముఖ ఛానెల్‌లో ఇలాంటి మ‌రో ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇది తెలిసిన మ‌ల్లెమాల మేనేజ్‌మెంట్ స‌ద‌రు డైరెక్ట‌ర్స్‌ను షో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌ని చెప్పింద‌ట‌. ఆ డైరెక్ట‌ర్స్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా నాగ‌బాబు కూడా షో నుండి వెళ్లిపోవాల‌నుకున్నాడు. తన‌తో పాటు జ‌బ‌ర్‌ద‌స్త్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంత మంది టీమ్ లీడ‌ర్స్‌ను తీసుకెళ్లిపోతున్నాడ‌ట నాగ‌బాబు.

More News

అనుకోకుండా జ‌రిగి పోయింద‌ని అంటున్న హీరోయిన్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోద‌రి.. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ప్ర‌స్తుతం ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘పవన్‌.. నీ అసలు పేరేంటి.. ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవ్!?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేడని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

జగన్ చిటికేస్తే.. టీడీపీ అడ్రస్ గల్లంతే.. బాబుకు దమ్ముంటే..!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్క చిటికేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

ఆర్జీవీని ఏమీ చేయలేక నన్ను అంటారేంటి..!?: వంశీ

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

బాలీవుడ్‌ రీమేక్‌లో నాగచైతన్య?

ఈ ఏడాది ‘మజిలీ’తో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్న హీరో నాగచైతన్య ఇప్పుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో