close
Choose your channels

నిహారిక నిశ్చితార్థానికి పవన్ హాజరు కాకపోవడానికి కారణమిదే..

Friday, August 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిహారిక నిశ్చితార్థానికి పవన్ హాజరు కాకపోవడానికి కారణమిదే..

మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహా మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. అయితే పవన్ ఎందుకు రాలేదనే దానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ ఆలోచనలు, నడిచే మార్గం మెగా హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. అందుకే ఆయనకు సంబంధించిన ప్రతిదీ ఆసక్తికరమే. కాగా పవన్ నిశ్చితార్థానికి హాజరుకాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పవన్‌కి, నాగబాబుకి ఏమైనా బేదాభిప్రాయాలు వచ్చాయా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఆయన చాతుర్మాస దీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష చేస్తున్న వారు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకమైన పూజ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆయన నిశ్చితార్థ వేడుకకు హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ నిన్న ఉదయం ఆయన నాగబాబు ఇంటికి వెళ్లి నిహారికను ఆశీర్వదించినట్టు తెలుస్తోంది.

ఇటీవల యంగ్ హీరో నితిన్ వివాహానికి కాకుండా దానికి ఒకటి, రెండ్రోజుల ముందు మధ్యాహ్న సమయంలో పవన్ వెళ్లి ఆశీస్సులు అందించి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేస్తున్న చాతుర్మాస దీక్ష నాలుగు నెలలు చేయాల్సి ఉంటుంది. ఆయన జులైలో ఈ దీక్ష ప్రారంభించినందున నవంబర్‌లో ముగియనుంది. ఈ దీక్ష ముగిసే వరకూ ఆయన తాను నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్‌కు కూడా హాజరు కాకపోవచ్చని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.