close
Choose your channels

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

Monday, April 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని.. దాంతో అతను అక్కడికక్కడే మృ‌తి చెందాడని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టడంతో అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయిన మొహమ్మద్‌ను పోలీస్ వాహనం‌లో ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ యువకుడు ముస్లిం కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8:40 గంటలకు చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసుల తీరు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు, మేధావులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. చనిపోయిన గౌస్‌కు 28 ఏళ్ల వయసు కాగా.. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది.

ఐజీ ఏమన్నారంటే..

మరోవైపు ఈ ఘటనపై గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్‌ రావు మీడియా ముందుకొచ్చారు. ‘సత్తెనపల్లిలో జరిగిన ఘటన దురదృష్టకరం. ఆ యువకుడ్ని వ్యక్తిని ఆపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ రమేశ్‌ బాబు ప్రయత్నించారు. అయితే, అప్పటికే షేక్‌ గౌస్‌కు చమటలు పట్టడంతో కిందపడిపోయాడు. దీంతో వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలో మరణించాడు. గౌస్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. మృతదేహంపై కూడా గాయాలేవీ లేవు. కచ్చితంగా ఈ ఘటనపై విచారణ జరిపి.. అసలు నిజాలు విచారణలో వెలికితీస్తాము. ఇప్పటికే ఎస్‌ఐను సస్పెండ్‌ చేశాం’ అని ఐజీ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.