స్వీటీ డబ్బింగ్ చెప్పలేకపోవడానికి కారణం అదేనా

  • IndiaGlitz, [Monday,February 12 2018]

తెలుగు సినిమాల్లోకి కొత్తగా వస్తున్న పరభాషా కథానాయికలు సైతం డబ్బింగ్ చెప్పుకుంటూ అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతున్నారు. అయితే పరిశ్రమకి వచ్చి దశాబ్దం పైనే దాటినా.. తెలుగు భాష బాగా వ‌చ్చినా.. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల‌పైనే ఆధారపడుతున్న నటి అనుష్క. సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ.. ఇంతవరకు తన గొంతుని సవరించుకోలేదు.

ఇటీవల భాగమతి' విజయోత్సవ వేడుకలో ఇదే ప్రశ్నను అడిగిన మీడియాకి ఆమె బదులిస్తూ, “నేను తెలుగు చాలా చక్కగా మాట్లాడగలను. కాకపోతే డబ్బింగ్ చెప్పుకునేంత గొప్ప గొంతు కాదు నాది. నా గొంతు అచ్చం చిన్న పిల్లల గొంతులా వుంటుంది. అది నేను చేసే పాత్రలపై ప్రభావం చూపుతుంది. ఈ కార‌ణంతో.. నేను చేసే పాత్రలకి డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. నేను మాట్లాడితే పక్కన కూర్చున్న వారికి కూడా వినపడదు. అందుకే మా ఇంట్లోవాళ్ళు కూడా నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు” అని త‌ను డబ్బింగ్ చెప్పలేకపోవడానికి గల కారణాన్ని వివరించింది స్వీటీ.

More News

డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఓ సినిమాని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 28న మెగాస్టార్ చిరంజీవి అతిధిగా మా సిల్వర్ జూబ్లీ వేడుకలు అమెరికాలో తొలి ఈవెంట్!

'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)25వ సంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

నిఖిల్ చిత్రంలో నితిన్ హీరోయిన్?

స్వామి రారా,కార్తికేయ,సూర్య వెర్సస్ సూర్య,ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో

శిక్షణ కోసం ఖజకిస్తాన్ వెళ్లనున్న మెగాహీరో

'కంచె' వంటి భిన్నమైన చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. 'ఫిదా' మూవీతో అందరి మన్ననలను పొందారు ఈ యువ కథానాయకుడు. తాజాగా విడుదలైన ‘తొలిప్రేమ’తో విమర్శకుల ప్రశంసల ను సైతం అందుకుంటున్నారు వరుణ్. ఇదిలా వుంటే...తన అప్ కమింగ్ మూవీని 'ఘాజీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డిత

శంకర్ హీరోగా 'శంభో శంకర'

ఆర్.ఆర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో శ్రీధర్ ఎన్.దర్శకుడిగా