Mudragada: వైసీపీలోకి ముద్రగడ చేరిక వాయిదా.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదాపడింది. గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు చేరికను రెండు రోజులు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.

గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి. 14-3-2024 తేదిన గౌరవ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌ జగన్మోహనరెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటి ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదు. వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్‌ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరోసారి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 లేదా 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్‌ గారి సమక్షంలో పార్టీలోకి చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

కాగా ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి.. ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పార్టీలో చేరడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కానీ సీఎం జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో జనసేన నేతలు ముద్రగడను కలిశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ నుంచి పిలుపురాకపోవడంతో అలకబూనారు.

ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ వేదికగా తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని జనసేనాని స్పష్టంచేశారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరం అవుతున్నట్లు మరో లేఖ పవన్‌కు రాశారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని.. ఒకవేళ ఆయన పోటీ చేయకుండా కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.

More News

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సిద్ధమైంది. మరో రెండు రోజల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది. ఈనెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను

చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..

ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు.

వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లకు TG ప్రిఫిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి గతంలో

డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు.. కొత్త రేషన్ కార్డులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది

PawanKalyan: భీమవరాన్ని వదలను.. కచ్చితంగా గెలిచి తీరాలి: పవన్ కల్యాణ్‌

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్‌ స్పందించారు. సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండని..175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నాయని