Download App

Red Review

ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అంటూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసి మాస్‌ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయిన రామ్‌ పోతినేని, తర్వాత కూడా అదే ఫార్ములాను ఫాలో కావాలనుకోలేదు. డిఫరెంట్‌ కథాంశంతో రూపొందిన 'రెడ్‌' సినిమాను అనౌన్స్‌ చేశాడు రామ్‌. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న తడం సినిమాకు ఇది రీమేక్‌. రీమేక్‌ సినిమా చేయడం సులభమని అనుకుంటాం కానీ.. అదే కష్టం. అప్పటికే వచ్చిన హిట్‌ టాక్‌ను దృష్టిలో పెట్టుకుని నెటివిటీని మార్చి, ప్రేక్షకులను మెప్పించేలా అంశాలను యాడ్‌ చేసి.. సినిమా సోల్‌ మిస్‌ కాకుండా సినిమాను తెరకెక్కించాలి. అప్పటికే తనతో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలు చేసిన కిషోర్‌ తిరుమలకు ఈ సినిమా రీమేక్ బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు కిషోర్‌ తిరుమల చేసింది.. ఎమోషనల్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌. మరి 'రెడ్‌' సస్పెన్స్‌ థ్రిల్లర్‌. మరి కిషోర్ తిరుమల రామ్‌ను ఎలా చూసిస్తాడోనని అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ రామ్‌, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో మూడో చిత్రంగా తెరకెక్కిన రెడ్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...

కథ:

ఆదిత్య(రామ్‌పోతినేని) డబ్బున్నవారిని మోసం చేస్తుంటాడు. పెద్దగా చదువుకోకపోయినా, లా విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. ఐదారు భాషల్లో చక్కగా మాట్లాడుతాడు. ఓసారి ఆదిత్య తన వీక్‌నెస్‌ కారణంగా స్నేహితుడి(సత్య) డబ్బునంతా పోగొట్టేస్తాడు. దాని వల్ల స్నేహితుడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. స్నేహితుడిని కాపాడటానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుంటాడు. మరో వైపు ఆదిత్య పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌లో ఉండే సిద్ధార్థ్‌(రామ్ పోతినేని). ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎండీ. మహిమ(మాళవికా శర్మ)ను చూసి ప్రేమించి, ఆమెను ప్రేమను గెలుచుకోవడమే కాదు.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కథ అక్కడే మలుపు తీసుకుంటుంది. ఆకాశ్‌ అనే కుర్రాడిని ఎవరో హత్య చేస్తారు. కేసుని డీల్‌ చేసే సీఐ(సంపత్‌)కు కేసు ఓ ఫజిల్‌లాగా కనిపిస్తుంటుంది. కేసుని సిన్సియర్‌ ఎస్సై యామిని(నివేదా పేతురాజ్‌)కి అప్పగిస్తాడు. అనుకోకుండా పోలీసులకు దొరికిన ఫొటో ఆధారంగా పోలీసులు ముందుగా సిద్ధార్థ్‌ను అరెస్ట్‌ చేస్తారు. పాత కక్షతో సీఐ ఎలాగైనా కేసులో సిద్ధార్థ్‌ను ఇరికించాలని చూస్తుంటాడు. అప్పటి వరకు పోలీసుకు తెలియని కోణం.. సిద్ధార్థ్‌ను పోలిన ఆదిత్య అరెస్ట్‌ అవుతాడు. దీంతో కేసులో కొత్త కన్‌ఫ్యూజన్‌ మొదలవుతుంది. అసలు హత్య చేసింది సిద్ధార్థ్‌, ఆదిత్యలలో ఎవరనేది తెలుసుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలేవీ ఫలించదు. కోర్టు కేసు కొట్టేస్తుంది. అదే సమయంలో యామినికి షాకింగ్‌ నిజం ఒకటి తెలుస్తుంది. హంతకుడెవరో తెలిసినా.. ఆమె ఏమీ చేయలేకపోతుంది. ఇంతకీ సిద్ధార్థ్‌, ఆదిత్యలలో హంతకుడెవరు? ఆకాశ్‌ను ఎవరు హత్య చేస్తారు?  అసలు యామినికి తెలిసిన నిజమేంటి?  నిజం తెలిసిన యామిని ఎందుక సైలెంట్‌గా ఉండిపోతుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష:

హీరో రామ్‌కి లేడీస్‌లో ఫాలోయింగ్‌ ఎక్కువ. అందగాడని ఆడవాళ్లు ఇష్టపడతారా? అతను సబ్జెక్ట్ ని సెలక్ట్ చేసుకునే తీరు చూసి ఆడవాళ్లు ఆదరిస్తారా? నేను శైలజ తరహా సినిమాలు చూస్తే మాత్రం తప్పకుండా ఆయనలోని సెన్సిబిలిటీస్‌ నచ్చేనని అనిపిస్తుంది.  లేటెస్ట్ గా రిలీజైన రెడ్‌ సినిమా ప్రమోషన్‌ మొత్తం రామ్‌ చేసిన డబుల్‌  యాక్షన్‌ చుట్టూ తిరిగింది. కానీ ఈ సినిమా మొత్తాన్ని ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా డీల్‌  చేసింది ఓ లేడీ.. ఆమె పేరు నివేదా పేతురాజ్‌. అప్పటిదాకా అడ్డదారులు తొక్కిన రామ్‌ పరివర్తనకు కారణమైంది ఓ లేడీ.. ఆమె పేరు అమృతా అయ్యర్‌. జీవితంలో ఒకమ్మాయి చూసీ చూసీ, ఆమెతో జీవితాంతం ఉండిపోవాలని డెస్టినేషన్‌ డిసైడైన ఓ పద్ధతైన యువకుడు, ఆమె జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి హంతకుడిగా మారుతాడు. అక్కడా ఓ లేడీ.. ఆమె పేరు మాళవిక శర్మ. ఐడెంటికల్‌ ట్విన్స్ గా రెడ్‌లో రామ్‌ కనిపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు క్లాస్‌గా ఉన్నా, మరొకరు మాస్‌గా ఉన్నా... వాళ్ల మాతృమూర్తి జీవితాన్ని తెరమీద ఆవిష్కరించిన తీరు కూడా బావుంది. అమ్మంటే ఎప్పుడూ అందంగా, అద్భుతంగా ఉండాలా? అమ్మకి కూడా ఓ జీవితం ఉంది. ఎన్నో ఒడుదొడుకులను ఎదర్కొంటుంది. వాటి నుంచి బయటపడే క్రమంలో కొన్నిసార్లు వ్యసనాలకు బానిస కావచ్చు. అయితే వాటిని సాటి మనుషులు అర్థం చేసుకోవాలి.. ఈ సినిమాలోనే చెప్పినట్టు రామాయణాన్ని ఆడది రాసి ఉంటే, కచ్చితంగా అనుమానం అనే పదానికి అక్కడితోనే ఫుల్‌స్టాప్‌ పడేదేమో! అనుమానం పెనుభూతం అని ఊరికే అనలేదు పెద్దలు. సున్నితమైన ఇలాంటి పలు విషయాలను అద్భుతంగా డీల్‌ చేశారు కిశోర్‌ తిరుమల. తమిళ్‌లో తడమ్‌ చూసిన వారికి, అక్కడి డైలాగులు అర్థమైనవారికి ఇక్కడ మళ్లీ అవే ఫ్రేమ్‌లు చూసినట్టు అనిపిస్తాయి. ఆ ఎమోష‌న్స్ క్యారీ కాలేదేమో అనిపిస్తాయి. అలాగే ఇస్మార్ట్ శంక‌ర్‌తో మాస్ ఇమేజ్ ద‌క్కించుకున్నరామ్ ఇమేజ్‌కు ప్ర‌స్తుతం ఇది స‌రిపోయే మూవీ కాద‌నే అభిప్రాయం క‌లుగుతుంది. అలాగే రామ్, మాళ‌వికా శ‌ర్మ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఎఫెక్టివ్‌గా అనిపించ‌దు. త‌మిళంలో స‌స్పెన్స్ పార్ట్‌కు ఉన్న ఇంపార్టెన్స్ తెలుగులో క‌నిపించ‌లేదా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల సినిమాను అనుకున్నంత బాగా హ్యాండిల్ చేయ‌లేద‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్ చాలా పెద్ద‌దిగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేటివ్ పార్ట్ ఉండ‌టంతో సినిమా స్లోగా అనిపిస్తుంది. నివేదా పేతురాజ్ పెర్ఫామెన్స్ అంత ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించ‌దు. సంప‌త్ పాత్ర‌ధారి ఏమో చాలా సీరియ‌స్‌గా అరిచేస్తుంటాడు. మ‌ణిశ‌ర్మ బీజీఎం అనుకున్నంత గొప్ప‌గా అనిపించ‌లేదు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌పీ ఓకే.  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు సినిమాను ఓసారి చూడొచ్చు.

బోట‌మ్ లైన్‌... `రెడ్‌`.. రామ్ డ‌బుల్ ధ‌మాకా ప్ర‌య‌త్నం మెప్పించ‌లేదు

Read Red Movie Review in English

Rating : 2.3 / 5.0