రెజీనా పెళ్లి కబురు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లోగానీ, కోలీవుడ్‌లోగానీ రెజీనా పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరే హీరోయిన్‌కూ వచ్చి ఉండవేమో. ఆ హీరోతో ఉందని కొన్నాళ్లూ, ఈ హీరోతో ఉందని కొన్నాళ్లు, పెళ్లయిపోయిందనికొన్నాళ్లూ ఆమె గురించి ప్రచారాలు జరిగాయి. తాజాగా మరో వార్త షికారు చేస్తోంది. అయితే దీని గురించి రెజీనాగానీ, ఆమె కుటుంబసభ్యులుగానీ ఇప్పటిదాకా నోరు తెరవలేదు. ఇంతకీ విషయం ఏంటంటే రెజీనాకు గత 13వ తేదీనే వివాహ నిశ్చితార్థం జరిగిందట. త్వరలోనే పెళ్లి కూడా కానుందట.
ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి, పెళ్లయ్యాక భారీ ట్రిప్పులు కూడా ప్లాన్ చేస్తోందట. అందుకే ఎవరైనా అడిగినా కాల్షీట్ కూడా లేదని అంటోందని చెన్నై టాక్. అయితే ఈ విషయాన్ని ఆమె తరఫున ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. నాన్నా పులి అన్నట్టు ఇప్పటికే పలు మార్లు ఆమె పెళ్లి వార్త షికారు చేయడంతో ఈ సారి పెద్దగా పట్టించుకున్నవారు కూడా లేదన్నదే వాస్తవం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.