close
Choose your channels

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

Monday, June 29, 2020 • తెలుగు Comments

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

తాను ఇప్పుడు ముద్దుల‌కు దూరం అని అంటోంది చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్ర‌. క‌రోనా ప్ర‌భావంతో సినీ పరిశ్రమ‌లో పెను మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ఈ ప‌రిస్థితుల గురించి రెజీనా మాట్లాడుతూ ‘‘కోవిడ్ 19 కారణంగా నా దినచర్యలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. అయితే లాక్డౌన్‌ను అనౌన్స్ చేసిన త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు ఇలాగే ఉంటుంద‌ని అనుకున్నాను. తొలి ద‌శ లాక్‌డౌన్‌లో సినిమాలు, సిరీస్‌లు బాగా చూశాను. కొత్త మ్యూజిక్ విన్నాను. సామాజిక దూరం పాటించిన‌ప్ప‌టికీ మ‌నుషులు ద‌గ్గ‌ర‌య్యారు. ఒక‌రికొక‌రు సాయప‌డ్డారు.

ఈ లాక్‌డౌన్ కార‌ణంగా న‌టించ‌లేక‌పోయాను. ఓ న‌టిగా అది నాకు బాధ‌ను క‌లిగించే విష‌య‌మే. అయితే నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఫొటో షూట్ చేశాను. షార్ట్‌ఫిలింకు డ‌బ్బింగ్ చెప్పాను. చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాను. ప్ర‌స్తుతం సినిమాల్లో ఇన్‌టిమెసీ సీన్స్‌, కిస్సింగ్ సీన్స్‌లో న‌టించ‌డానికి భ‌యంగా ఉంది. క‌రోనా ప్ర‌భావం బాగా త‌గ్గిన త‌ర్వాతే అలాంటి స‌న్నివేశాల్లో న‌టిస్తాను’’ అన్నారు.

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

హీరోయిన్‌గా కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌నే చేయాల‌ని కాకుండా న‌టిగా డిఫ‌రెంట్ రోల్స్ చేయ‌డానికి రెజీనా ఆస‌క్తి చూపుతుంటారు. అందుక‌నే ఆ!, 7, ఎవ‌రు వంటి చిత్రాల్లో నెగిటిల్ టచ్ ఉన్న‌ప్ప‌టికీ న‌టించారు.

Get Breaking News Alerts From IndiaGlitz