ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు..

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

ఏపీకి వెళ్లాలనుకునే వారు ఇకపై పెద్దగా షరతులేమీ లేకుండా సులువుగా వెళ్లవచ్చు. అన్‌లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీలోకి వచ్చే వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులనిస్తూ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఆర్అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్‌.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీకి వచ్చేవారు స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆటోమాటిక్‌గా ఈ పాస్.. మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుందన్నారు. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చని వెల్లడించారు. ఈ నమోదు కార్యక్రమమంతా వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమేనని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారన్నారు. రేపటి నుంచి ఈ విధానం అమలు జరుగుతుందని కృష్ణబాబు వెల్లడించారు.