సూర్య 24 రిలీజ్ కి ముహుర్తం కుద‌రింది

  • IndiaGlitz, [Monday,January 25 2016]

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో సూర్య నిర్మిస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా పంపిణీ హ‌క్కుల‌ను హీరో నితిన్ ద‌క్కించుకున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యాన‌ర్ పై నితిన్ ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

టైమ్ మిష‌న్ క‌థాంశంగా రూపొందుతున్న 24 మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. సూర్య స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంది. సంక్రాంతి కి ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళ్ లో 24 మూవీని రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసారు. మ‌రి..సూర్య మూడు డిఫ‌రెంట్ రోల్స్ చేసిన 24తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

బ్యాంకాక్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'.

రామోజీ, ర‌జ‌నీ,రాజ‌మౌళి ల‌కి ప‌ద్మ అవార్డులు

2016 సంవ‌త్స‌రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌కు ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది.

యంగ్ టైగ‌ర్ ని బీట్ చేస్తున్న కింగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి కానుక‌గా రిలీజై రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది.

ప‌వ‌న్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ తెర‌కెక్కించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం ఓవ‌ర్సీస్ మార్కెట్ లో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది.

నటి కల్పన మృతికి సంతాపం తెలిపిన 'ఊపిరి' యూనిట్‌

నటి ఊర్వశి సోదరి కల్పన(51) ఈరోజు(25) తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించారు. తమిళ, మలయాళ భాషల్లో కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న కల్పన