'బిగ్‌బాస్ 3' కి హైకోర్టులోఊర‌ట‌

  • IndiaGlitz, [Wednesday,July 17 2019]

బిగ్‌బాస్ మూడో సెష‌న్ 'బిగ్‌బాస్ 3' ప్రారంభానికి ముందే ప‌లు వివాదాల‌కు కేంద్ర‌మైంది. న‌టీమ‌ణులు శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోప‌ణ‌లు చేసి సంచ‌నాల‌కు తెర తీశారు. అలాగే జంజారా హిల్స్, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్స్‌లో కేసులు న‌మోద‌య్యాయి. బిగ్‌బాస్ షోను ఆపాలంటూ, నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాలంటూ పిటిష‌న‌ర్స్ తెలంగాణ హైకోర్టును కోరారు.

అయితే వీటికి భిన్నంగా నిర్వాహ‌కులు త‌మ‌ను అరెస్ట్ చేయ‌రాదంటూ క్వాష్ పిటిష‌న్ వేశారు. కేసును ప‌రిశీలించిన హైకోర్ట్.. పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసులు, పిటిష‌న‌ర్‌ను కోరుతూ కేసును వ‌చ్చే బుధ‌వారానికి వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసింది. బిగ్‌బాస్ 3 ఈ నెల 21న నాగార్జున వ్యాఖ్యాత‌గా ప్రారంభం కానుంది. 

More News

హైదరాబాద్ నవాబ్ 2 మిమ్మల్ని నవ్విస్తుంది - నిర్మాత, దర్శకులు ఆర్.కె

2006 లో వచ్చిన హైదరాబాద్ లో వచ్చిన హైదరాబాద్ నబాబ్ సినిమాకు సీక్వెల్ హైదరాబాద్ నవాబ్ 2 జులై 19న విడుదల కానుంది.

'మాస్ ప‌వ‌ర్ ' 50 రోజుల వేడుక‌!!

శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై శివ జొన్న‌ల‌గ‌డ్డ స్వీయ ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తూ నిర్మించిన చిత్రం `మాస్ ప‌వ‌ర్`.

రాయ్‌ల‌క్ష్మికి క‌రెంట్ షాక్‌

సాధార‌ణంగా సోయ‌గాల‌తో అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు షాకిచ్చే ప‌నిని హీరోయిన్స్ చేస్తుంటారు. కానీ రాయ్‌ల‌క్ష్మికి మాత్రం వింత ప‌రిస్థితి ఎందురైంద‌ట‌.

చైత‌న్య‌కి సాధ్య‌మ‌వుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో బిజీగా మారాడు. ఇప్ప‌టికే త‌ను `వెంకీ మామ‌` చిత్రంలో న‌టిస్తున్నాడు.

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరోయిన్‌

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్‌కు స్థానం ఎప్పుడూ ఉంటుంది. మాలీవుడ్‌, శాండిల్ వుడ్ హీరోయిన్స్ హ‌వా ఈ మ‌ధ్య ఎక్కువ అవుతుంది.