ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..!

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

రేణుదేశాయ్...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను పంచుకునే రేణుదేశాయ్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రి ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ అవుతున్నారు అంటే...రేణు దేశాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడినా...ప‌వ‌న్ ఫోటోలు పోస్ట్ చేసినా ఇప్పుడు ఇదంతా అవ‌స‌ర‌మా..? అంద‌రి దృష్టి ఆక‌ర్షించ‌డానికే రేణు ఇలా చేస్తుంది అంటూ కొంత మంది విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ట‌.

ఈ విమ‌ర్శ‌లు రేణుదేశాయ్ ని బాగా బాధ‌ప‌ట్టాయ‌ట‌. అందుకే ఈ విమ‌ర్శ‌ల పై రేణుదేశాయ్ స్పందిస్తూ...వేరే హీరోల అభిమానులే ఇలా నన్ను విమ‌ర్శిస్తున్నారు. వాళ్ల ప్ర‌స్టేష‌న్ అంతా సోష‌ల్ మీడియాలో చూపిస్తున్నారు. మీ హీరోను మీరు అభిమానించండి కానీ...వేరే హీరోను, వాళ్లకు సంబంధించిన వ్య‌క్తుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ఫోటో అంద‌రూ పెట్టుకోవ‌చ్చు. నేను పెట్టుకుంటే త‌ప్పా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ఫోటో పెట్ట‌ద్దు అని చెప్పినంత మాత్రాన నేను పెట్ట‌డం మానేస్తానా..? క‌ళ్యాణ్ గారికి లేని అభ్యంత‌రం వేరే వాళ్ల‌కు అభ్యంత‌రం ఏమిటో నాకు అర్ధం కావ‌డం లేదు అంటూ తన మ‌న‌సులో మాట‌లు బ‌య‌ట‌పెట్టారు..! మ‌రి...ఇప్పుడైనా రేణుదేశాయ్ పై విమ‌ర్శ‌లు చేసే వాళ్లు ఆపేస్తారో లేదో చూడాలి..!

More News

మిలియ‌నీర్ అయిన నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళుతున్నాడు క‌దా..ఉంటే గింటే త‌ను కోటీశ్వ‌రుడై ఉండాలి. అలాంటిది త‌ను మిలియ‌నీర్ ఎలా అయ్యాడ‌నుకుంటున్నారా.

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?

నారా రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విభిన్న చిత్రాల క‌థానాయ‌కుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంలో రాయ‌ల్‌రాజు పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీవిష్ణు క‌థానాయ‌కులుగా నిర్మించ‌బ‌డుతున్న చిత్రం `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`.

మా అబ్బాయి రోష‌న్ నాకంటే మంచి స్ధాయికి వెళ‌తాడు అనేది నా న‌మ్మ‌కం - శ్రీకాంత్

శ్రీకాంత్ - ఊహ‌ల ముద్దుల త‌న‌యుడు రోష‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

బిచ్చ‌గాడు హీరోయిన్ పెళ్లి - ఫిర్యాదు చేసిన త‌ల్లి..!

సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన తమిళ సినిమా పిచ్చైకారన్. ఈ చిత్రం తెలుగు లో బిచ్చగాడు టైటిల్ తో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ తో నాగ్ మూవీ..!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. చిన్న చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.