చంద్రబాబుకి షాకిచ్చిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని


Send us your feedback to audioarticles@vaarta.com


అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అయితే రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం తమ పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. ఎన్నికలకు తాను హాజరు కాలేనని పేర్కొంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. తాను ఇటీవలే తాను వ్యాపార రీత్యా తెలంగాణకు చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశానని పేర్కొన్నారు.
ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తానూ హోమ్ క్వారంటైన్లో ఉన్నానని అనగాని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు తాను రాజ్యసభ ఎన్నికలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. పార్టీకి ఎలాంటి అవసమొచ్చినా ముందుండే తాను ఎన్నికలకు మాత్రం హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. పార్టీకి వీర విధేయుడినైన తాను రాజ్యసభ ఎన్నికలకు హాజరు కాలేకపోవడం పట్ల అనగాని ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా.. అనగాని లేఖపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.