close
Choose your channels

Auto Debit: ఆటో డెబిట్‌పై ప్రజలకు ఆర్‌బీఐ తీపి కబురు .. ఇక రూ.15 వేల వరకు ఓటీపీతో పనిలేదు

Thursday, June 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్యాంకింగ్ , ఆర్ధిక సేవలకు సంబంధించి బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. రెపో రేటును భారీగా పెంచిన ఆయన.. ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారానూ యూపీఐ పేమెంట్స్ జరపవచ్చని వెల్లడించారు. తొలుత రూపే కార్డులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆటో డెబిట్ ఆప్షన్‌కు సంబంధించి కూడా ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్లులు, బ్యాంకుల ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటికి చాలా మంది డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐల ద్వారా ఆటో డెబిట్ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) అవసరం లేని ఆటో డెబిట్ పరిమితిని రూ.5000 నుంచి రూ.15 వేలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. తద్వారా ఇకపై వినియోగదారులు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే రూ. 15 వేల వరకు ఆటో డెబిట్‌గా పెట్టుకోవచ్చు.

ఆటో డెబిట్ లావాదేవీలను సురక్షితంగా మార్చడానికి గానూ గతేడాది అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిలో భాగంగా ఆటో డెబిట్ తేదీ.. డెబిట్ అయ్యే నగదు మొత్తం వివరాలను 24 గంటలకు ముందే వినియోగదారులకు తెలియజేయాలని బ్యాంక్‌లను ఆదేశించింది. అలాగే రూ.5000లకు మించిన ఆటో డెబిట్‌ చెల్లింపులకు గాను వినియోగదారులు.. వన్ టైం పాస్‌వర్డ్ వంటి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను మాన్యువల్‌గా చెప్పాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పరిమితిని రూ.15,000కి పెంచింది ఆర్‌బీఐ. రూ.15 వేలకు మించిన మొత్తాన్ని ఆటో డెబిట్ చేయాల్సినప్పుడు మాత్రమే బ్యాంకులు వినియోగదారులను అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌‌ను అడగాలని సూచించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.