పవన్‌‌ పిలిచి అవమానించారు.. అందుకే రాజీనామా!

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

ఎన్నికల ముందు జనసేనకు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చేయగా తాజాగా మరో కీలకనేత జనసేనకు గుడ్‌బై చెప్పారు. మార్చి 18న మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దాస్‌కు పవన్‌ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయన పార్టీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అసలేం జరిగిందో దాస్ మాటల్లోనే...

మార్చి 18వ తేదిన జనసేన పార్టీలో చేరాను. పామర్రు నుంచి మాత్రమే జనసేన నుంచి పోటీ చేస్తానని పవన్‌కు చెప్పాను. బీఫాం ఇవ్వకుడా డిస్ట్రబెన్స్ చేసారు. సీనియర్ నాయకుడునని కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. పామర్రు సీటు బీఎస్పీకి ఇచ్చాం వారితో మాట్లాడుకోవాలని పవన్ చెప్పడంతో తీవ్ర మనస్థాపనకు గురిచేసింది. నేను చేరింది జనసేన సీటు కోసం.. కానీ బీఎస్పీతో మాట్లాడు కోవటం ఏమిటో అర్థం కావట్లేదు. పామర్రు సీటు ఇవ్వాలంటే బీఎస్పీలో చేరమని ఆ పార్టీ నాయకులు చెప్పారు.

అంతేకాదు శుక్రవారం రోజు పార్టీ తరఫున బీఫామ్ ఇస్తామని పిలిపించి ఇవ్వకుండా అనమాన పరిచారు. ప్రజలకోసం పార్టీని స్థాపించారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ స్థాపించారా? అనేది నాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీలో నన్ను అవమానకరంగా ట్రీట్ చేశారు. నాకు సీటు ఇవ్వకపోవటంలో టీడీపీ హస్తం ఉన్నట్లు నేను బావిస్తున్నాను. సిట్టింగల్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను గెలిపించేదుకు నాకు సీటు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అందుకే జనసేనకు రాజీనామా చేసి నుంచి బయటకు వచ్చాను అని దాస్ మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. కాగా జనసేనకు రాజీనామా చేసిన దాస్ ఏ పార్టీలో చేరతారన్నది ఇంతవరకూ అనే విషయం అనుచరులు, ముఖ్య కార్తలతో చర్చించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దాస్ తెలిపారు.

More News

పవన్ సీఎం అయినా ఫర్వాలేదు.. కానీ..: పోసాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయినా ఫర్వాలేదు.. తాను అభినందిస్తానని ప్రముఖ డైరెక్టర్ పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. భీమవరం బహిరంగ సభలో పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ నిర్వహించారు.

'రిటర్న్ గిఫ్ట్' ఒకరికి కాదు.. ఇద్దరికి!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎక్కడ చూసినా వినపడే ఒకే ఒక్కపదం ‘రిటర్న్ గిఫ్ట్’. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ టైమ్‌లో ఈ మాట అన్నాడో

"చీకటి గదిలో చితకొట్టుడు"  చిత్రాన్ని  ఆదరిస్తున్న  ప్రేక్షకులకు థాంక్స్ -  చిత్ర యూనిట్

బ్లూ ఘోస్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్‌, నిక్కి తంబోలి, హేమంత్‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు'. సంతోష్ పి. జయకుమార్ దర్శకుడు.

ఐదేళ్ల వరకు ఊసే లేదు

బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌, ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోషన్‌ శ్రేష్ఠ డేటింగ్‌ చేస్తున్నారని వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని వార్తలు వినపడ్డాయి.

మే 1న 'అర్జున్ సురవరం'

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి.