close
Choose your channels

‘రేవంత్’ మాస్టర్ ప్లాన్.. ఫెయిలైతే బీజేపీలోకి!?

Thursday, September 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘రేవంత్’ మాస్టర్ ప్లాన్.. ఫెయిలైతే బీజేపీలోకి!?

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందా..? పార్టీలు మారడానికి నేతలు అనవసర రాద్ధాంతాలన్నీ తెరపైకి తెస్తున్నారా..? అసలు ఉత్తమ్-రేవంత్‌రెడ్డిల గొడవ వెనుక అసలు కారణం మరొకటి ఉందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు రేవంత్ వ్యూహమేంటి..? పార్టీలో ఇమడలేక ఇలా చేస్తున్నారా..? లేకుంటే ఈయన మనసులో ఇంకేముంది..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

‘నువ్వెంత.. నువ్వెంత’!

ముందస్తు ఎన్నికల్లో హుజుర్ న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎంపీగా గెలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాతో త్వరలోనే ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నిక దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అతిపెద్ద నియోజకవర్గం గెలిచి నిలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య అభ్యర్థి విషయంలో ఫైట్ జరుగుతోంది. అంతేకాదండోయ్ ‘నువ్వెంత.. నువ్వెంత’ అనుకునే వరకు పరిస్థితులూ వెళ్లాయి.!?.

ఎప్పుడూ మీకేనా.. ఈ సారి నేను!

తన భార్య పద్మావతిని ఈ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపాలని ఉత్తమ్ భావిస్తుండగా.. ప్రతీ ఎన్నికకూ మీరేనా అంటూ రంగంలోకి దిగిన రేవంత్.. తాను కిర‌ణ్‌రెడ్డిని బరిలోకి దింపుతానని ప్రకటించారు. కిరణ్ అనే వ్యక్తి ఇటీవలే ఉత్తమ్ కోటరీ నుంచి రేవంత్‌కు దగ్గరయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తమ్‌ మాట ఎక్కడా పడనివ్వకూడదనుకున్న రేవంత్.. ఏకంగా ఆయనకే షోకాజ్ నోటీస్ ఇవ్వాల‌ని కుంతియాని కోర‌డ‌ం గమనార్హం. దీంతో మరోసారి రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

ఇదీ అసలు కథ..!

ఇక అసలు విషయానికొస్తే.. వాస్తవానికి రేవంత్‌ పార్టీలోకి వచ్చిన మొదట్లో పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయన్ను పార్టీలో ఎవరూ లెక్కచేయట్లేదు.. అందుకే పార్టీ మారాలని పక్కాగా ఫిక్స్ అయిపోయిన ఆయన ఈ ‘హుజూర్‌నగర్ ఉపఎన్నిక’ను ఒక పావులాగా వాడుతున్నారని తెలుస్తోంది. ఇదిగానీ తాను చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ టాటా చెప్పేస్తారని.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఒకరిద్దరు కీలక నేతలతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే పార్టీని వీడటానికి మాత్రం రేవంత్ పెద్ద మాస్టర్ ప్లానే వేశారన్న మాట. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. ఏంటో మరి వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.