2017 సమీక్ష - సినీ వివాదాలు

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

సినిమా అంటే రంగ‌లు ప్ర‌పంచం..వినోదాల‌ను పంచే హ‌రివిల్లు అని అనుకుంటారు. ప్ర‌తి ఏడాది ప్రేక్ష‌కుల‌కు వినోదాల‌ను పంచిన సినిమాలెన్నో. అలాంటి సినిమా ప‌రిశ్రమ‌పై ఈ ఏడాది వచ్చిన వివాదాలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి.

అందులో ముందుగా వ‌చ్చిన వివాదం గాయ‌ని సుచిత్రా కార్తీక్‌ది. సుచి లీక్స్ పేరుతో సుచిత్ర ద‌క్షిణాది హీరోల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌తమైన న్యూడ్ వీడియోలు బ‌హిర్గ‌తం చేసింది. అందులో ముఖ్యంగా ధ‌నుష్‌, అనిరుధ్‌, న‌య‌న‌తార‌, నివేదా పేతురాజ్‌, అనిరుధ్‌, సింగ‌ర్ చిన్మ‌యి..ఇలా ఎంతో మందికి సంబంధించిన వార్త‌ల‌తో సుచి లీక్స్ క్రియేట్ చేసిన ర‌భ‌స అంతా ఇంతా కాదు.

త‌ర్వాత టాలీవుడ్‌ను ఊపేసిన వివాదం డ్ర‌గ్స్ వివాదం...ఎక్క‌డో స్కూల్స్‌, ప‌బ్స్‌ల్లో వ్యాపారం చేసే డ్ర‌గ్స్ నేరస్థుల‌ను అరెస్ట్ చేసిన పోలీసుల‌కు..వారికి సినిమా రంగంతో ఉన్న సంబంధాలు తెలుసుకుని షాక‌య్యారు. వెంట‌నే అంద‌రినీ ఇంటరాగేట్ చేశారు. వారిలో పూరి జ‌గ‌న్నాథ్‌, శ్యామ్ కె.నాయుడు, సుబ్బ‌రాజు, న‌వ‌దీప్‌, హీరో త‌రుణ్‌, ఛార్మి, ర‌వితేజ‌, త‌నీష్ ఇలా సినిమా ఆర్టిస్టులు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. అస‌లు వీరిని అనుమానించి విచార‌ణకు పిలిచామంతే కానీ..వీరు దోషులు కారు అని పోలీసులు వ్యాఖ్యానించినా..సినిమా ప‌రిశ్ర‌మ‌పై పెద్ద మ‌చ్చ ప‌డింది.

ఇక ఈ ఏడాది సినిమా రంగాన్ని కుదిపేసిన వివాదం నంది అవార్డులకు సంబంధించింది. ఏపీ ప్ర‌భుత్వం 2014, 2015, 2016 ఇలా మూడు సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. అయితే 2014లో లెజెండ్‌కు 9 నంది అవార్డులు రావ‌డం..మ‌నం, రుద్ర‌మ‌దేవి వంటి చిత్రాల‌కు అవార్డులు రాకపోవ‌డం వివాద‌స్ప‌ద‌మ‌య్యింది. దీనిపై స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు బాహాటంగానే త‌మ అంస‌తృప్తిని వెలిబుచ్చారు. పోసాని కృష్ణ‌ముర‌ళి అయితే తాను నంది అవార్డును వెన‌క్కిచ్చేస్తాన‌ని అన్నారు.

అలాగే హాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై కూడా వివాదం మొద‌లై, హాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇది కాస్త బాలీవుడ్‌, ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ద‌క్షిణాది న‌టీమ‌ణులు తమ‌కి కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ఎదురు కాలేద‌ని చెప్ప‌డంతో ఆ వివాదం ఇక్క‌డ పెద్ద ఎఫెక్ట్‌ను చూప‌లేక‌పోయింది.

ఇలా వివాదం ఎంత పెద్ద‌దై కూర్చుందో అంతే సైలెంట్‌గా కూడా మారిపోయింది. పాల‌పొంగులాంటి వివాదాలుగా పేరును సంపాదించుకున్నాయి. ఈ వివాదాలు ఇక్క‌డితో ముగిసిపోయి వ‌చ్చే 2018 ఏడాది సినిమాకు వివాద ర‌హితంగా ఉండాల‌ని కోరుకుందాం

More News

ప్రొజెక్ట్ జెడ్‌.. ఓ వివాదం

సందీప్ కిషన్, లావణ్యత్రిపాఠి నాయకానాయికలుగా సి.వి.కుమార్ నిర్మించి, రూపొందించిన త‌మిళ చిత్రం  'మాయావన్'. తెలుగులో 'ప్రాజెక్ట్ జెడ్' పేరుతో అనువదించారు.

రవితేజ 'టచ్ చేసి చూడు' షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.

మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'రన్ రాజా రన్ ' ఫేమ్ సీరత్ కపూర్.

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ  సినిమా త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు చ‌ర‌ణ్‌. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

నాగ చైతన్య 'ధర్మాభాయ్'?

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచారు అక్కినేని నాగ చైతన్య.