close
Choose your channels

‘కమ్మరాజ్యంలో.. మూవీపై ఆర్జీవీ షాకింగ్ విషయం

Wednesday, November 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘కమ్మరాజ్యంలో..’ మూవీపై ఆర్జీవీ షాకింగ్ విషయం

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఎల్లుండి అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు రిలీజ్ అవుతుందా..? కాదా..? అని ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌కు ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌గానీ.. ఆడియో లాంచ్‌ ఇలాంటివేమీ లేకుండా డైరెక్టుగా ఆర్జీవీనే మీడియా ముందుకొచ్చేశాడు. ఈ సందర్భంగా అసలు సినిమా సంగతేంటి..? ఎవరెవర్ని ఎలా చూపించారు..? సినిమా జోనర్ ఎలా ఉంటుంది..? అనే ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నాడు.

ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌!
వాస్తవానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించడం.. ఆ తర్వాత ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ చూశాక దీనిపై అంచనాలు పెరిగిపోయాయ్. అంతేకాదు.. పొలిటికల్‌గా సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని భావించారు. సినిమా రిలీజ్ రోజే వెళ్లాలి.. తర్వాతి రోజు వెళ్తే ఎక్కడ డైలాగ్స్ మిస్సవుతాయోనని అభిమానులు, ఔత్సాహికులు వేచిచూస్తున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా సినిమా ఉండదట.. ‘అంతా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు తీస్తాన’ని ఆర్జీవీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఆయన.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అందరూ అనుకున్నట్లుగా ఉండదని.. ‘ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌’ అని ఆయన ఊహించని షాక్‌ ఇచ్చాడు. దీంతో ఇదేంటి.. ఆర్జీవీ ఊరించి ఉసూరుమనిపించారని అభిమానులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

గిల్లుడు ఏ మాత్రం ఉంటుందో..?
‘ఈ సినిమా ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ మాత్రమే. ఇందులో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించలేదు. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నాను అంతే. నేను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయను.. కేవలం నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తాను. మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అందుకే ఈ మధ్య ఆ తరహా సినిమాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నాను. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చింది. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నాను. అయితే వారి పేర్లు మాత్రం అడగొద్దువద్దు. నాకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం.. అందుకే నేను ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తీస్తుంటాను. నాకు ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుంది. బాగా తిట్టించుకోవటం నాకు ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నాను’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. మరి ఆర్జీవీ గిల్లుడు ఏ మాత్రం ఉంటుందో..? ఎవరెవరు ఏ రేంజ్‌లో తిడతారో..? హైకోర్టు ఏం తీర్పునుందో ఇలాంటి అన్ని విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.