సెన్సార్ బోర్డు పై వ‌ర్మ కేసు..

  • IndiaGlitz, [Sunday,March 17 2019]

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు సెన్సార్ బోర్డుపై గుర్రుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా! ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌' చిత్రాన్ని సెన్సార్ బోర్డు ఎన్నిక‌లు వ‌ర‌కు ఆప‌మని కోరింది.

ఈ సినిమాను ఎన్నిక‌ల వ‌ర‌కు ఆపాల‌ని టీడీపీ వ‌ర్గీయులు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు కూడా పిర్యాదు చేశారు. 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌' తెలుగుదేశం పార్టీకి ఎన్నిక‌ల్లో న‌ష్టం కలిగించేలా ఉండ‌టంతో సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది.

సెన్సార్ బోర్డ్ త‌న ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి సెన్సార్ బోర్డుపై కేసు వేయాల‌నుకుంటున్నాను అని వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు విడుద‌ల చేసిన ప‌లు తీర్పుల‌ను ఉదాహ‌రిస్తూ ఓ పెద్ద లేఖ కూడా రాశారు.

ఇప్పుడు వ్య‌వ‌హారం ఏ మ‌లుపు తీసుకోనుందో తెలియ‌డం లేదు.. కానీ.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల అనుకున్నట్లుగా ఈ నెల 22న అవుతుందా? అనే సందేహాలు నెల‌కొన్నాయి.