close
Choose your channels

చంద్రబాబుకు ఆర్జీవీ బస్తీమే సవాల్.. జై జగన్!

Saturday, May 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబుకు ఆర్జీవీ బస్తీమే సవాల్.. జై జగన్!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఆర్జీవీ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసినప్పటికీ రాష్ట్రంలో మాత్రం కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా అడ్డుకోవడం ఆఖరికి ఈ పంచాయితీ సుప్రీం కోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టులో మధ్యలో ఎన్నికల కమిషన్ మధ్య ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ నలిగిపోయారు. అంతేకాదు ఆఖరికి ప్రశాంతంగా చిత్రానికి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆఖరికి విజయవాడ నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌కు ఆర్జీవీ సిద్ధమవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లి ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు పంపించేశారు. ఎన్నికల ముందు ఇదంతా పెద్ద పంచాయితీనే జరిగింది.

అయితే ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడ్నుంచి వెళ్లగొట్టారో అక్కడే ప్రెస్‌మీట్ పెట్టి తీరుతానని గత చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఆర్జీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ప్లాప్ కాగా.. కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ డంఖా మోగించగా మే-30న వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తనకు రెక్కలొచ్చేశాయని రామ్‌గోపాల్ వర్మ ఫీలవుతున్నారు!. వైసీపీకి చెందిన రాకేశ్ రెడ్డి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన విషయం విదితమే. వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది ఇక మనకు మంచిరోజులొచ్చినట్లే అని అటు రాకేశ్... ఇటు ఆర్జీవీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో విడుదలకు నోచుకుని ‘లక్ష్మీ్స్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ ప్రెస్‌మీట్స్ అవీ.. ఇవీ అని ఆర్జీవీ హంగామా మొదలెట్టేశారు. ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ వివరించారు.

ఆర్జీవీ ట్వీట్ సందేశం...

"ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!!. ఎన్‌టీఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానo.. జై జగన్" అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చాలా వరకు ఆర్జీవీకే సపోర్ట్ చేస్తూ నెటిజన్లు, అభిమానులు.. ఆఖరికి టీడీపీ కార్యకర్తలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఆర్జీవీ ప్రెస్‌మీట్ సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.