చంద్రబాబుకు ఆర్జీవీ బస్తీమే సవాల్.. జై జగన్!

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఆర్జీవీ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసినప్పటికీ రాష్ట్రంలో మాత్రం కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా అడ్డుకోవడం ఆఖరికి ఈ పంచాయితీ సుప్రీం కోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టులో మధ్యలో ఎన్నికల కమిషన్ మధ్య ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ నలిగిపోయారు. అంతేకాదు ఆఖరికి ప్రశాంతంగా చిత్రానికి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆఖరికి విజయవాడ నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌కు ఆర్జీవీ సిద్ధమవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లి ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు పంపించేశారు. ఎన్నికల ముందు ఇదంతా పెద్ద పంచాయితీనే జరిగింది.

అయితే ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడ్నుంచి వెళ్లగొట్టారో అక్కడే ప్రెస్‌మీట్ పెట్టి తీరుతానని గత చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఆర్జీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ప్లాప్ కాగా.. కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ డంఖా మోగించగా మే-30న వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తనకు రెక్కలొచ్చేశాయని రామ్‌గోపాల్ వర్మ ఫీలవుతున్నారు!. వైసీపీకి చెందిన రాకేశ్ రెడ్డి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన విషయం విదితమే. వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది ఇక మనకు మంచిరోజులొచ్చినట్లే అని అటు రాకేశ్... ఇటు ఆర్జీవీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో విడుదలకు నోచుకుని ‘లక్ష్మీ్స్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ ప్రెస్‌మీట్స్ అవీ.. ఇవీ అని ఆర్జీవీ హంగామా మొదలెట్టేశారు. ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ వివరించారు.

ఆర్జీవీ ట్వీట్ సందేశం...

ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!!. ఎన్‌టీఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానo.. జై జగన్ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చాలా వరకు ఆర్జీవీకే సపోర్ట్ చేస్తూ నెటిజన్లు, అభిమానులు.. ఆఖరికి టీడీపీ కార్యకర్తలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఆర్జీవీ ప్రెస్‌మీట్ సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా

లగడపాటి రాజకీయమే కాదు.. ఇక పై సర్వే సన్యాసం కూడా!!

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికలు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ‘ఆర్జీప్లాష్’ టీమ్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

సెన్సార్ పూర్తి చెసుకున్న "సువ‌ర్ణ‌సుంద‌రి" 

జ‌య‌ప్ర‌ద‌,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌ హీరోగా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రం

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా  ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా

అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు ల చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో