'ఫ్యామిలీ మ్యాన్ 2'పై ఆర్జీవీ రివ్యూ.. అంత నచ్చిందా!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఆయన పాజిటివ్ గా మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎంతో నచ్చితే కానీ ఒక అంశంపై వర్మ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వరు. తాజాగా వర్మ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: రవితేజ, త్రినాధరావు మూవీ ఆగిపోలేదు.. ఇదిగో క్లారిటీ!

'ఫ్యామిలీ మ్యాన్ 2 రియలిస్టిగ్ గా తెరకెక్కించబడ్డ జేమ్స్ బాండ్ తరహా కథ. ఫ్యామిలీ మ్యాన్ ప్రాంచైజీ మరింత కాలం దూసుకుపోతూనే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, వినోదం కలగలిపి నటించడం చాలా కష్టం. అది కేవలం మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులకు మాత్రమే సాధ్యం. ఆయన డ్రామాని, సహజత్వాన్ని చాలా చక్కగా క్యారీ చేశారు' అని వర్మ ప్రశంసల జల్లులు కురిపించాడు.

మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. దర్శకులు రాజ్ అండ్ డీకే.. నటులు మనోజ్ బాజ్ పాయ్, సమంతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 1 పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కగా ఫ్యామిలీ మ్యాన్ 2 శ్రీలంక తమిళ రెబల్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం దర్శకులు రాజ్ అండ్ డీకే చైనా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు.

More News

రవితేజ, త్రినాధరావు మూవీ ఆగిపోలేదు.. ఇదిగో క్లారిటీ!

మాస్ మహారాజ రవితేజ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లవర్స్ ని ఉరూతలూగించే టాలీవుడ్ హీరోలలో రవితేజ ఒకరు.

'లాల్ సలామ్' ట్రైలర్: మా ఫ్రెండ్ ల్యాండ్ మైన్ తొక్కాడు.. ఏం చేయాలి..

కోవిడ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డాయి. దీనితో ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఓటీటీలే ఆధారంగా మారాయి.

'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' ట్రైలర్ : కోరికని రెచ్చగోట్టెది సైతాన్.. ప్రాణం తీసేది దేవుడు

కమెడియన్ ప్రియదర్శి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ లీడ్ పెయిర్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'.

రాజీనామా సమర్పించిన ఈటెల.. కౌరవ, పాండవ యుద్ధమే ఇక!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆకతాయిల తిక్క కుదిర్చిన పవన్ 'బంగారం' పాప!

హీరోయిన్ల శరీరాకృతి గురించి మాట్లాడడం నెటిజన్లకు అలవాటే. సెలెబ్రిటీలు కూడా తమపై వస్తున్న కామెంట్స్ కు పెద్దగా రియాక్ట్ అవ్వరు.