close
Choose your channels

ఎన్టీఆర్‌ను పోర్న్‌స్టార్‌తో పోల్చిన ఆర్జీవీ!

Wednesday, May 20, 2020 • తెలుగు Comments

ఎన్టీఆర్‌ను పోర్న్‌స్టార్‌తో పోల్చిన ఆర్జీవీ!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడతారో..? ఎలా మారుతారో..? ఎవరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారో..? ఎవర్ని అందలమెక్కిస్తాడో..? ఆయనకే తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు వివాదాలు.. ఆరు తిట్లు అంతే అన్నట్లుగా బతికేస్తుంటారు. అలా రోజు వివాదాల్లేనిదే ఆయనకు నిద్రపట్టదు.. వివాదాలతోనే పడుకుని.. వివాదాలతోనే నిద్రలేస్తారు. ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ కోణంలోనే చూస్తూ వివాదంగా మలుచుకునే ఆర్జీవీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై కూడా కాస్త వివాదం రేపే వ్యాఖ్యలే చేశారు.

నెట్టింట్లో సిక్స్ ప్యాక్ పిక్ వైరల్..

మే-20న నందమూరి వీరాభిమానులకు పండగరోజు. ఎందుకంటే ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం కనుగ. కరోనా కష్టకాలం కాబట్టి సోషల్ మీడియా పరిమితం అవుతూ విషెస్ చెబుతున్నారు కానీ.. అదే పరిస్థితులు మంచిగా ఉండుంటే ఇక మాటల్లో చెప్పలేం. ఇలాంటి సందర్భంలో జూనియర్‌పై ఆర్జీవీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఓ పిక్‌ను ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన ఆర్జీవీ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్ల వర్షం కురిపించారు.

మియా తర్వాత ఎన్టీఆరే!

అందరిలాగే తన ట్వీట్స్‌ను విషెస్‌తో సరిపెట్టుకుంటే ఏం బాగుంటుంది అనుకున్నాడేమో కానీ.. ఏకంగా ఆయన సిక్స్ బ్యాక్ బాడీని ప్రముఖ పోర్న్ స్టార్.. ఆర్జీవీ ఇదివరకే ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ లఘు చిత్రంలో నటించిన మియా మాల్కోవాతో పోల్చారు. ‘మియా మాల్కోవా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇందుకు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, ఆర్జీవీ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ప్రస్తుతం మీరు మియాతో క్లైమాక్స్ అనే సినిమా చేశారనుకుంటాను.. ఇంకా అదే మత్తులో ఉన్నారా ఏంటి సామీ.. కాస్త బయటికి రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నేను గే కాదు కానీ..!

అంతటితో ఆగని ఆర్జీవీ మరో ట్వీట్ కూడా చేశారు. ‘నేను స్వలింగ సంపర్కుడిని (గే) కాదని మీకు బాగా తెలుసు. కానీ ఈ పిక్ చూశాక నేను ఒకటి కావాలని అనుకుంటున్నాను. ఆ బాడీ ఏంట్రా నాయనా.. ఆ.. ఆ’ అని మరో ట్వీట్ వదిలారు ఆర్జీవీ. వర్మ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ తిట్టిపోస్తుండగా.. మరోవైపు ఆర్జీవీ అభిమానులు మాత్రం ‘హవ్వా.. ఎన్టీఆర్‌ను వదల్లేదు కదా సామీ మీరు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆర్జీవీ ఏం చెప్పాలనుకున్నారో..? ఇది ప్రశంస అనుకోవాలో..? లేకుంటే సెటైర్ అనుకోవాలో..? అభిమానులు, నెటిజన్స్‌కు అర్థం కావట్లేదు.

Get Breaking News Alerts From IndiaGlitz